ప్రెజర్‌ పీక్స్ వెంకయ్యకే!

ప్రత్యేక హోదా విషయంలో ఎక్కువ ప్రెజర్‌ ఫీలవుతున్నది వెంకయ్యనాయుడే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు, నరేంద్రమోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్‌ని ఈయనే తెరపైకి తెచ్చారు. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ద్వారా ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించింది వెంకయ్యనాయుడే. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు, అప్పటి ప్రధానితో ఆ ప్రకటన చేయించగలిగారుగానీ, ఇప్పుడు కేంద్ర మంత్రంగా ఉండి కూడా నరేంద్రమోడీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇప్పించలేకపోతున్నారు. […]

పదవి పోయినా డోన్ట్‌ కేర్‌: కేశినేని

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం తమ పదవులు పోయినా లెక్కచేయబోమని టిడిపి ఎంపీలు అంటున్నారు. బిజెపితో అమీ తుమీకి సిద్ధమని చెబుతూ అధినేత చంద్రబాబు సంకేతాల కోసం ఎదురుచూస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. అలాగే, పదవుల కోసం పాకులాడేవాళ్ళం కాదని రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ఎలా పోరాటం చేయాలన్నదానిపై వ్యూహరచన చేస్తున్నామని చంద్రబాబు సూచనలతో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకుంటామని […]

జగన్‌కి ఇదే వెపన్‌ అవుతుందా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేతిలో భారతీయ జనతా పార్టీ ‘ఆయుధం’ పెట్టేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని బిజెపి చెప్పినా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఆచి తూచి స్పందిస్తున్నారు. పూర్తిగా చంద్రబాబు ఆలోచనల్ని ఖండించడానికి లేదు. కేంద్రంతో విభేదాలు ఏ రాష్ట్రానికీ మంచిది కాదనేది ఆయన ఉద్దేశ్యం కావొచ్చు. అయితే ప్రతిపక్షంగా పోరాడేందుకు పూర్తి అవకాశం ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీనీ అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీనీ ఇరకాటంలో […]

చెత్త మాట: చంద్రబాబు భయపడతారా!

నరేంద్రమోడీని చూసి చంద్రబాబు భయపడతారా? అన్న ప్రశ్న రాజ్యసభలో టిడిపి ఎంపి వేశారు. అసందర్భమైన ప్రశ్న ఇది. ప్రత్యేక హోదా అడగడానికి చంద్రబాబు భయపడుతున్నారనే వాదన ఉత్పన్నమవుతోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ, ఎన్‌డిఏ ప్రభుత్వంలో భాగస్వామి. కాబట్టి, చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రాష్ట్రానికి గతంలో రాజ్యసభ ద్వారా సంక్రమించిన ప్రత్యేక హోదా హక్కుని సాధించుకుని ఉండాలి. నరేంద్రమోడీ ప్రభుత్వం అంటే అందులో చంద్రబాబు కూడా భాగమే గనుక, ఇది చాలా సులువైన […]

ఏపీ కాంగ్రెస్ కి అదే సంజీవిని!

ఏపిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రభావం చూపలేకపోతోందని కాంగ్రెస్ పార్టీ నేతలే ధృవీకరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సర్వంకోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నా మైలేజీ పార్టీకి చేరడంలేదు . ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత బతికివుందంటే అది పార్టీకి అంటిపెట్టుకొన్న కొంత మంది సీనియర్‌ నేతల వల్లేనని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. పార్టీలో సీనియర్ నేతలు, సమయానుసారం ప్రజా సమస్యలపై స్పందిస్తున్నా విభజిత ఆంధ్ర ప్రదేశ్ […]

కాంగ్రెస్ కి షాక్ ఇచ్చిన చిరంజీవి

ప్రత్యేక హోదా ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని ముందుకు నడిపించాలంటూ కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి వచ్చిన ఆఫర్‌ని మెగాస్టార్‌ చిరంజీవి తిరస్కరించారని సమాచారమ్‌. కాంగ్రెసు పార్టీ నుంచి చిరంజీవి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు తాను సినిమాలపై దృష్టిపెట్టడం వల్ల పార్టీ కార్యక్రమాల్ని చూసుకోలేకపోతున్నట్లుగా చిరంజీవి, ఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసినప్పుడు వివరించారట. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కానీ దాన్ని నడపలేక, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని […]

ప్రత్యేక హోదా కూడా వ్యాపారమేనా టీజీ?

దేశం లో పార్లమెంటు ఉభయ సభల్లో కూర్చున్న వారిలో అధికభాగం పారిశ్రామిక వేత్తలే కావడం మన దురదృష్టం.ఎవరికి వారు వారి వారి వ్యాపార విస్తరణ,సంరక్షణకు రాజకీయాల్లోకి రావడం పార్లమెంటుకెళ్ళి కాలక్షేపం చెయ్యడం తప్ప ప్రజా సమస్యలపై పోరాడే ఎంపీ లు మన దేశం లో చాలా తక్కువ.ఇక మన రాష్ట్ర ఎంపీ ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఆయన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాడు.ఏ నాడు ప్రజా సమస్యలపై పోరాడిన పాపాన పోలేదు.పోరాటం దాకా […]

కయ్యమా,వియ్యమా: బాబు దారెటు ?

ప్రత్యేక హోదా అనే పదాన్ని వినడానికి కూడా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇష్టపడటంలేదు. ఆ ఎన్‌డిఎ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగమే. రాజ్యసభలో ఈ రోజు జరగాల్సిన ఓటింగ్‌ని భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా జరగనీయలేదు. కానీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రత్యేక హోదా బిల్లుకి అనుకూలంగా ఓటేయడానికి సిద్ధమైంది. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో. బిజెపి నుంచి ‘బిల్లుపై ఓటింగ్‌ జరగనీయం’ అని హామీ వచ్చిన తర్వాతే, ‘ఆ బిల్లుకి అనుకూలంగా ఓటేస్తాం’ […]

అయ్యోపాపం ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్‌ని ఇప్పుడు చాలా జాలిగా చూడాల్సిన సందర్భం. దేశంలోని మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ దయనీయ స్థితిని చూసి చలించిపోవాలి. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా అంతర్భాగమన్న విషయాన్ని ఒకప్పటి కాంగ్రెసు ప్రభుత్వం, ఇప్పటి బిజెపి ప్రభుత్వం విస్మరించాక, ఆంధ్రప్రదేశ్‌ గోడు ఎవరు పట్టించుకుంటారు? ప్రత్యేక హోదా హామీ రెండున్నరేళ్ళ క్రితం పార్లమెంటే ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చింది. కానీ అది అమలు కాలేదు. దాని అమలు కోసం ఇంకో బిల్లు ప్రైవేటుగా పార్లమెంటులో పెట్టవలసిన దుస్థితి ఇంతవరకు దేశంలో ఏ […]