తానా 24 గ్రాండ్ మీట్స్ మూడోవ రోజు సెలబ్రేషన్స్ సైతం గ్రాండ్ లెవెల్లో జరిగాయి. ఈ క్రమంలో.. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేసింది. ఈ ఈవెంట్లో సమంత మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. సమంత స్టేజ్‌పై చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రెజెంట్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. సబంత ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఈ వేదికపై నిలబడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తను ప్రతి సంవత్సరం తానా మీట్స్ గురించి వింటానని.. ఏమాయ చేసావే నుంచి నన్ను మీలో ఒకరిగా చూసిన తెలుగు ప్రేక్షకులు అందరికీ చాలా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది.
తను ఏ నిర్ణయం తీసుకున్న తెలుగువారు ఏమనుకుంటారు అని ఆలోచిస్తానని చెప్పిన సమంత.. వేదికపై తన ప్రసంగంలో ఎమోషనల్ అయింది. దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఈ వేదికపై నిలబడడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ప్రతి సంవత్సరం తానా గురించి వింటున్నా. మీరు నాపై ప్రేమను కురిపిస్తుంటే.. ఇక్కడికి వచ్చి ధన్యవాదాలు చెప్పడానికి ఇంత సమయం పట్టింది. నా కెరీర్లో ముఖ్యమైన దశ.. నా మొదటి ప్రొడక్షన్ శుభం. దాన్ని ఎక్కువగా అభిమానించిన వ్యక్తులు ఉత్తర అమెరికాలో వారే.
ఇక నేను తీసుకునే ప్రతి నిర్ణయం.. ముందు తెలుగు ఆడియన్స్ గురించే ఆలోచిస్తా. ఏ నిర్ణయం తీసుకోవాలనే ముందు నాకు వచ్చే ఆలోచన అదే. నాకు ఒక గుర్తింపుని ఇచ్చింది వాళ్లే.. నా సొంతిల్లు తెలుగు.. నేను నిజంగానే చెప్పాలనుకుంటున్నా.. ఓ బేబీతో మిలియన్ డాలర్లు సంపాదించానని గుర్తుంది. నేను దానిని నమ్మలేకపోయాను. మీరు నాకు దూరంగా ఉన్నా.. నా హృదయంలో మాత్రం ఎప్పటికీ ఉంటారు. మీకు నా కృతజ్ఞతలు అంటూ షేర్ చేసుకుంది.