నితిన్ ‘ తమ్ముడు ‘ పబ్లిక్ టాక్.. ఈసారైనా హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ తాజాగా నటించిన తమ్ముడు సినిమా.. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా, వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందిన సంగతి తెలిసిందే. లయ, వర్ష బొల్లమా, సప్తమి గౌడా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా.. కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అయితే.. ఇప్పటికే సినిమా అమెరికా ప్రీమియర్లు ముగిశాయి. అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్‌ల‌ ప్రకారం.. పబ్లిక్ టాక్ ఎలా ఉంది.. సినిమాతో ఈసారైనా నితిన్ కొట్టడా.. లేదా.. ఒకసారి చూద్దాం.

స్టోరీ:
సినిమా మొత్తం ఒక రాత్రిలో జరిగే కథ‌ అని మొదటి నుంచి దర్శక, నిర్మాతలు చెబుతూనే ఉన్నారు. ఇక‌ సినిమా స్టార్టింగ్ పావుగంట పాటు కొంత స్టోరీ జరిగినా.. తర్వాత మొత్తం నైట్ స్టోరీ షిఫ్ట్ అవుతుంది. అక్క కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమయ్యే తమ్ముడు.. ప్రాణాలను తెగించి ఎంతవరకు వెళ్ళాడు.. వాళ్ల‌ను కాపాడేందుకు ఎలాంటి యుద్ధం చేసాడు.. అసలా యుద్ధం ఎందుకు మొదలైంది.. అనేది అసలు స్టోరీ. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రివ్యూ:
వేణు శ్రీరామ్ స్టోరీ నేపథ్యం చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయడానికి కష్టపడ్డాడట‌. కథ‌ను ఆయన చెప్పాలనుకున్న విధానంలో ఒక నావాల్టిగా రూపొందించాడని అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌.. స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది. స్టోరీ లైన్‌ చిన్నది కావడంతో.. ఒక రాత్రిలో జరిగే కథను అంతలా విడమర్చి చూపించడంతో.. సినిమా కాస్త లాగ్ అన్న ఫీల్ కలిగినా.. స్టోరీ మాత్రం ఆకట్టుకుంటుందట‌. ఇక నితిన్ పడిన కష్టం తెరపై కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని.. సినిమాల్లో ఒక బాధ్యతగల తమ్ముడుగా 100% ఎఫ‌ర్ట్స్‌తో నితిన్ ఆకట్టుకున్నాడని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన లయ సైతం.. తన న‌ట‌న‌తో ఆకట్టుకుంది.

సినిమాకు అమ్మ‌డి నటన మరింత ప్లస్ అయిందపి.. తనలో న‌టిని సరికొత్తగా పరిచయం చేసిన లయ.. ఎమోషనల్ సన్నివేశాలను అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక.. హీరోయిన్లుగా నటించిన వర్షా బొల్లమ, సప్తమి గౌడ క్యారెక్టర్లను వైవిధ్యంగా చూపించారు. హీరోయిన్లు చేసే ఫైట్స్.. సినిమానూ ఒక వైవిధ్యమైన యాంగిల్ లో చూపించాయి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్‌ ఆడియన్స్‌కు కాస్త బోర్ కొట్టించినా.. స్లోగా సాగుతుందని అనిపించిన.. ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయని చెప‌స్తున్నారు. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే.. సెకండ్ హాఫ్ చాలా బెటర్. కానీ.. సినిమాకు ఆడియన్స్‌ నుంచి 100% హిట్ టాక్ రావడం కూడా కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్ ని సినిమా ఎలా మెప్పిస్తుందో.. అనే దానిపై కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి.