సాయి పల్లవి ” రామాయణ్ ” షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడంటే..?

సౌత్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా.. రణ్‌బీర్ కపూర్ హీరోగా తెర‌కెక్కనున్న భారీ పాన్‌ ఇండియన్ ప్రాజెక్ట్ రామాయణ్. ఈ సినిమాతో సాయి స‌ల్ల‌వి నార్త్ ఎంట్రీ ఇవ్వ‌నుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో.. మైథ‌లాజికల్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో.. రాముడిగా ర‌ణ్‌బీర్‌, సీతగా సాయి పల్లవి క‌నిపించ‌నున్నారు.

ఇక కన్నడ సూపర్ స్టార్ యష్ రావణుడి పాత్రలో నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ మండోదరి రోల్ లో మెరవనున్నట్లు సమాచారం. కాగా ఇప్ప‌టికే ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌గా.. తాజాగా ఫస్ట్ భాగం షూట్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే మూవీ టీం కేక్ కట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్న ఫొటో సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్‌తో పంచనున్నారు.

ರಾಕಿಂಗ್ ಸ್ಟಾರ್ ಯಶ್ ಜೋಡಿಯಾಗಿ ಕಾಜಲ್ ಅಗರ್‌ವಾಲ್, ಯಾವ ಸಿನಿಮಾ ಅಂದ್ರೆ? | Kajal  Aggarwal to play Mandodari opposite Yash in the epic saga Ramayana -  Kannada Filmibeat

ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారుతున్న క్ర‌మంలో.. రామాయణ్ సినిమా పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా.. ఫస్ట్ భాగం షూట్ ముగియడంతో.. 2026 దీపావళి సందర్భంగా రామాయణ్‌ పార్ట్ 1 రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు.. రెండో భాగాన్ని 2027 దీపావళికల్లా పూర్తి చేసి రిలీజ్ చేస్తామని ఇప్పటికే టీం ప్రకటించడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ భాగం గ్లింప్స్‌ వీడియో జులై 3, 2025న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తున్నట్లు టాక్.