తారక్ ” మురుగన్ ” లో ఆ స్టార్ బ్యూటీని దింపుతున్న త్రివిక్రమ్.. పక్కా సూప‌ర్ హిట్ రాసిపెట్టుకోండి..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా బాలీవుడ్ ఇంటర్వ్యూ కూడా సిద్ధమయ్యాడు తారక్. హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలో అన్ని సినిమాల‌పై కేవలం టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ కాంబోలో టైటిల్‌తో మరో సినిమా తెరకెక్క‌నుంది. ఇప్పటికే సినిమా షూట్ మేకర్స్ స‌ర‌వేగంగా జరుపుకుంటున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ డైరెక్షన్లో మురుగన్ అనే మైథలాజికల్ మూవీలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వైర‌ల్‌ అవుతున్న‌ సంగతి తెలిసిందే. దీనిపై మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇవ్వకుండా ఎన్టీఆర్ చేతిలో రీసెంట్గా కనిపించిన బుక్‌ను బట్టి.. దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఆల్మోస్ట్ మురుగన్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ ఫిక్స్ అయినట్లు టాక్‌ నడుస్తుంది.

NTR holds Muruga's book for Trivikram

నిజానికి ఈ రోల్ కోసం మొదట అల్లు అర్జున్‌ను అనుకున్నాడు త్రివిక్రమ్. అంతేకాదు.. వాళ్ల కాంబోలో ప్రాజెక్టు కూడా ఫిక్స్ అయి మొత్తం టీం కూడా ఫైనలైజ్ అయిన తర్వాత.. కాల్షీట్లు కూడా ఇచ్చిన బ‌న్నీకి త్రివిక్రమ్‌కు హ్యాండ్ ఇచ్చాడు. పుష్ప 2 సాలిడ్ హితో ఒక్కసారిగా ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే.. త‌న నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉండాలని భావించిన ఆయన.. త్రివిక్రమ్ సినిమాను హోల్డ్‌లో పెట్టి.. ఆ ప్లేస్‌లో అట్లిని దింపారు. ఇక తర్వాత అయినా అల్లు అర్జున్ సినిమా చేస్తాడని అంతా భావించారు. కానీ.. సడన్గా తారక్‌ను త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టులోకి దింపాడంతో న్యూస్ తెగ వైరల్‌గా మారింది. తారక్‌ సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. దీంతో.. అల్లుఅర్జున్ నుంచి తారక్ ఖాతాలోకి ప్రాజెక్ట్‌ వెళ్లిపోయింది. ప్రస్తుతం డ్రాగ‌న్‌లో నటిస్తున్న తారక్.. తర్వాత దేవర 2 సినిమాను కూడా పూర్తిచేసి వెంటనే మురుగన్ సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నాడట.

Sai Pallavi turns Jr NTR's wife onscreen? Here's truth

ఈ లోపు.. త్రివిక్రమ్, వెంకటేష్‌తో సినిమా ఫినిష్ చేసేసి ఎన్టీఆర్.. సినిమా పనులన్నీ ముగించుకొని సెట్స్‌లోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో.. తారక్‌కు జోడిగా ఎవరిని చూస్ చేసుకోబోతున్నారని న్యూస్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే.. మొదట ఈ సినిమాల్లో రష్మిక మందన, జాన్వి కపూర్ పేర్లు వినిపించినా.. తర్వాత సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్‌లో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందంటూ టాక్ నడుస్తుంది. ట్రెడిషనల్ క్యారెక్టర్ కనుక.. సాయి పల్లవికి మించిన హీరోయిన్ టాలీవుడ్ లో ఎవ్వరు ఉండరు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే.. సాయి పల్లవి, తారక్ కాంబో కోసం ఫ్యాన్స్.. తెగ‌ వెయిట్ చేస్తున్నారు. ఈ కాంబోలో సినిమా వర్కౌట్ అయితే మాత్రం.. వెయ్యి కాదు 2000 కోట్ల మార్కులు కూడా టచ్ చేసేస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.