ఇండియన్ సినీ ఇండస్ట్రీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా హీరో క్రేజ్ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో.. ఎవరి పాపులారిటీ ఎలా ఉండబోతుందో అనే అంశాలపై ఎవరు ముందు అంచనా వేయలేరు. ఈ క్రమంలోనే గత కొద్దిఏళ్లుగా ప్రముఖ సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రతినెల పాన్ ఇండియన్ టాప్ 10 హీరోల జాబితాను రిలీజ్ చేస్తూ వస్తుంది. అలా తాజాగా 2025 అక్టోబర్ నెలకు సంబంధించిన టాప్ 10 ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోల లిస్టు కూడా ఓర్మాక్స్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం పాపులర్ హీరోల లిస్టులో టాలీవుడ్ హవా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో.. తెలుగు హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ జాబితాలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. మొత్తం ఆరుగురు తెలుగు హీరోలు నిలవడం విశేషం. ఇంతకీ ఏ హీరో.. ఏ పొజిషన్లో ఉన్నాడో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రతిష్టత్మక జాబితాలో మొదటి స్థానంలో ఎప్పటిలాగే ప్రభాస్ చోటు దక్కించుకున్నాడు. ఇక రెండో స్థానంలో కోలీవుడ్ హీరో నిలవగా.. మూడవ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు. అయితే.. ఈ జాబితాలో అందరి దృష్టిని ఆకట్టుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మహేష్ బాబు ఈ లిస్టులో ఆరో స్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. వారణాసి సినిమాతో ఈయన క్రేజ్.. పాన్ ఇండియా లెవెల్‌లో నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది.

ఇక.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమాలోని నటిస్తూ పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీని దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే.. ఆయన 10వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం వీళ్ళిద్దరి ప్లేసులు అందరికీ ఆకర్షణీయంగా నిలిచాయి. ఇక ఈ లిస్టులో ఏడవ స్థానంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చోటు దక్కించుకోగా.. ఎనిమిదవ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దూసుకుపోతున్నారు. కేవలం ఈ లిస్టులో ఒకప్పుడు బాలీవుడ్ హీరోల పేర్లు మాత్రమే వినిపించేవి. అలాంటిది ఇటీవల కాలంలో నేషనల్ మెజారిటీ స్థానాలు సౌత్ ఇండియన్ హీరోలకు ముఖ్యంగా మన టాలీవుడ్ హీరోలకు తగ్గడం విశేషం. టాప్ 10లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు టాలీవుడ్ హీరోలు ఉండడంతో టాలీవుడ్ ఆడియన్స్ ఈ లిస్టు చూసి ఫిదా అవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో మన టాలీవుడ్ మరింత ఎత్తుకు ఎదగనుందో.. ఈ స్థానాలలో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయో చూడాలి.

