ఇటీవల కాలంలో పెద్ద సినిమాలకు ఊహించని రేంజ్‌లో కలెక్షన్లు అందడం లేదు. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కష్టమవుతుంది. దీని అంతటికి టికెట్ రేట్ల పెంపకమే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతి తక్కువ రేట్లతో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన రోజుల్లో రికార్డులు క్రియేట్ చేసేయని.. ఇటీవల కాలంలో టికెట్ రేట్లకు హైప్ పెంచడంతోనే.. సినిమాలు బ్రేక్ ఈవెన్ విషయంలో ఫెయిల్ అవుతున్నాయంటూ తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఏపీ సర్కార్ టికెట్ హైప్ విషయంలో సామాన్యుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఏపీలోను టికెట్ రేట్ల పెంపు ఉండబోదని.. ఆ ఆ విధంగా ప్లానింగ్ ప్రారంభించినట్లు తెలుస్తుంది.
ఇక ఈ విధానం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల నుంచే మొదలవుతుందని.. సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఏ సినిమాలో టికెట్ రేట్లు పెంపు ఉండదని టాక్ నడుస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ సినిమాల విషయంలోనూ కఠినంగా ప్రవర్తించలేదు. హైక్ అడిగిన ప్రతి సినిమా మేకర్స్‌కు అనుకూలంగా పర్మిషన్లు పాస్ చేశారు. ఈ క్రమంలోనే.. ఒకవేళ ఏపీ సర్కార్ సడన్గా టికెట్ రేట్ టికెట్ ధరలు మాత్రం పరిమితంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలోనే.. సంక్రాంతి సినిమాలకు తిప్పలు తప్పవని.. ప్రతి సినిమాతో సత్తా చాటాలని భావిస్తుండగా.. టాలీవుడ్ హీరోలకు టికెట్ ధరల హైక్ ఉండకపోతే.. కలెక్షన్లు మరింతగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని.. పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ వీకెండ్, సెకండ్ వీకెండ్‌లో సినిమాకు వచ్చిన కలెక్షన్స్ పరిమితం కావడం.. తర్వాత నుంచి కలెక్షన్‌లు అంతంత మాత్రంగానే ఉంటాయి. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో వాస్తవం ఏంతో తెలియాల్సి ఉంది. ఒకే విధంగా అన్ని సినిమాల టికెట్ రేట్లు ఉండేలా.. ఏపీ ప్రభుత్వం జీవో పాస్ చేయనుందట. టికెట్ రేట్లు ఇవ్వాలంటే ఏపీలో సినిమా షూటింగ్ జరిగుండాలని నిబంధనలు సైతం తీసుకురానున్నారని తెలుస్తోంది.

