ఒక్క ఫ్లాప్ లేని సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్.. ఒకప్పటి లారీ డ్రైవర్.. ఇది అసలు సక్సెస్!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో త‌న‌దైన ముద్రవేసుకుని స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్న ఎంతోమంది గతంలో ఎన్నో కష్టాలను భరించి ఈ స్టేజ్‌కు వచ్చిన వారే. అలాంటి వారిలో.. ఇప్పుడు మనం చెప్పుకోపోయే ఈ స్టార్ డైరెక్టర్ కూడా ఒకరు. తన యంగేజ్‌లో కాలేజ్ మానేసి లారీ డ్రైవర్‌గా పనిచేసిన అతను.. సినీ రంగంలో ఎన్నో గొప్ప సినిమాలను తెర‌కెక్కించిన‌ దర్శకుడుగా తన ముద్ర వేసుకున్నాడు. కేవలం ఒక్క ఇండస్ట్రీ కాదు మొత్తం పాన్ వరల్డ్ లో ఆయన పేరు తెలియని వాళ్లు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో చెప్పలేదు కదా.. జేమ్స్ కెమరున్ హాలీవుడ్‌లో ఆయన తెర‌కెక్కించిన అవతార్ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్‌లో సక్సెస్‌ను అందుకున్నాడు.

James Cameron, Academy Award-Winning Filmmaker, Joins Stability AI Board of  Directors — Stability AI

అయితే.. కొన్ని సందర్భాల్లో సినిమా కథ‌లకంటే నిజ జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులు చాలా షాకింగ్ అనిపిస్తాయి. జేమ్స్ కామెర్న్ జీవితం కూడా అలాగే ఉండేదట. ఇక ప్రస్తుతం జేమ్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడిగా నిలిచాడు. పలు నివేదికలు ప్రకారం ఆయన అసలు 1.1 బిలియన్స్ అట‌. టీనేజ్‌లో మాత్రం కాలేజ్ మానేసి ఉద్యోగం కోసం ఎంత వెతికినా దొరకకపోవడంతో.. ఒక ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేశాడు. తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో రోజర్ కార్మెన్ న్యూ వరల్డ్ పిక్చర్స్ లో వారానికి 175 డాలర్లకు పని చేసేవాడట. తర్వాత మెల్ల మెల్లగా తనకున్న ఎక్స్పీరియన్స్ తో దర్శకుడుగా మారాడు.

James Cameron: "I Will Always Mourn Some Of The Stories That I Don't Get To  Make” Because of 'Avatar' Commitment

1981లో పిర్వాన 2 డైరెక్టర్గా కెరీర్‌ ప్రారంభించాడు. అయితే.. సినిమా పూర్తికాకముందే డైరెక్టర్‌గా తప్పుకున్న జేమ్స్.. 1984లో డిటెర్మినేటర్ మూవీతో ఆడియన్స్‌ ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత 1997లో టైటానిక్‌తో ప్రపంచాన్ని మొత్తం తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత 12 సంవత్సరాలకు అవ‌తార్‌తో సంచ‌ల‌నం సృష్టించాడు. దర్శకత్వం వహించినది కేవలం నాలుగైదు సినిమాలైనా.. అన్ని సినిమాలతో భారీ సక్సెస్‌లు కొట్టి.. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒక్కరిగా దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా ఆయన నుంచి రిలీజ్ అయిన అవతార్ ఫైర్ అండ్ యాష్ సైతం మూడు రోజుల ప్రపంచ వ్యాప్తంగా రూ.3,000 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టడం విశేషం.