తారక్ వర్సెస్ బన్నీ.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు రాజేస్తున్న త్రివిక్రమ్..

ప్రస్తుతం టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌పై అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు.. ఇటు తారక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అసలు త్రివిక్రమ్ ఎందుకు తారక్ నుంచి చరణ్‌కి.. చరణ్ నుంచి తారక్ ద‌గ్గ‌ర‌కు గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్‌ తిప్పుతున్నాడంటూ.. కుర్చీలు ఆట ఆడుతున్నాడా అంటూ పండిపడుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్, వెంకటేష్.. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2026 సమ్మర్‌లో సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమాకన్న‌ ముందు త్రివిక్రమ్ మరో భారీ ప్రాజెక్ట్ చేయాల్సి ఉండగా.. అది ఆలస్యమవుతున్న క్రమంలోనే ఈ ఆదర్శ కుటుంబం సినిమా సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

GOD OF WAR🦚 #NTRTrivikram❤️ . @jrntr . Pc: @shiva4ntr . #ntr #jrntr  #ntrfans #jrntrfans #love

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో నాలుగవ‌ సినిమాగా.. యుద్ధ దేవుడు కార్తికేయ స్వామి కథ ఆధారంగా మైథాలజికల్ ఫిలిం 2023లో అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీనిపై ఆడియన్స్‌లోను మంచి హైప్‌ మొదలైంది. పుష్ప 2 తర్వాత.. అల్లు అర్జున్, త్రివిక్రమ్‌తో సినిమా చేస్తాడని అంత అనుకున్నా.. ఆయన రూట్ మార్చి అట్లీ డైరెక్షన్‌లో సైన్స్ ఫిక్షన్ ఫిలిం పనుల్లో బిజీ అయ్యాడు. దీంతో త్రివిక్రమ్ ఇదే ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్‌తో ప్లాన్ చేశాడంటూ వార్తలు వినిపించాయి. విషయాన్ని నాగ వంశీ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. రాగా.. తారక్ – ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్‌లోనే త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాను మొదలు పెట్టాడు.

God of War: ఎన్టీఆర్ అవుట్.. అల్లు అర్జున్ ఇన్.. త్రివిక్రమ్ న్యూ ప్లాన్  ఇదేనా? | Trivikram's God of War Project: Allu Arjun or Jr NTR? Mythological  Pan-India Film Sparks Buzz - Telugu Filmibeat

ఈ ఇద్దరు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత గాడ్ ఆఫ్ వార్‌తో బిజీ అవుతారని అంతా అనుకున్నారు. ఫ్యాన్స్ కూడా ప్రాజెక్ట్‌ కోసం అంచనాలు పెట్టుకున్నారు. ఇలాంటి టైంలో మళ్లీ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు త్రివిక్రమ్. తారక్ నుంచి ప్రాజెక్ట్ను మళ్ళీ బన్నీ వైపుకు ఈ ప్రాజెక్ట్‌ తీసుకెళ్లడని.. త్వరలోనే దీన్ని అఫీషియల్ గా ప్రకటిస్తారని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్ట్ విషయంలో కన్ఫ్యూషన్ మొదలైంది. బన్నీ హీరోనా.. లేదా తారక్ నటిస్తాడా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక వీళ్ళిద్దరిలో ఎవరు హీరోగా నటించినా.. మరో హీరో అభిమానులు మాత్రం బాగా హర్ట్ అవుతారు. దీంతో.. హీరోల ఫ్యాన్ వార్ మొదలవుతుందేమో అంటూ.. దీనికి త్రివిక్రమే కచ్చితంగా కారణమంటూ అభిప్రాయాలు వెక్తంచేస్తున్నారు.