నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లు వెనక్కి వెళ్తే.. బాలయ్య కెరీర్ దారుణమైన డిజాస్టర్‌లతో.. మళ్లీ కెరీర్‌లో హీరోగా కోలుకోగలడా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అఖండ, భగవంత్ కేసరి, వీర సింహారెడ్డి, డాకు మహారాజ్ ఇలా వరుసగా నాలుగు హిట్‌లు లో అందుకున్నాడు. ఈ సినిమాల తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం సైతం ఆడియన్స్‌లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని ఇప్పటికి థియేటర్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌క దగ్గరవుతున్న క్రమంలో.. బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అభిమానులలో ఆసక్తి మొదలైంది. దానికి తగ్గట్టుగానే ఈ ప్రాజెక్ట్ ఓ రేంజ్‌లో ఉండబోతుందట.

ప్రతి ఒక్క ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా కంటెంట్ ఆకట్టుకుంటుంది అంటూ తెలుస్తుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలయ్య నటిస్తున్న రెండవ సినిమా ఇది. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన వీర సింహారెడ్డి ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే.. కాంబోపై మొదటి నుంచి మంచి హైప్ మొదలైంది. ఇక.. ఈ సినిమా కోసం గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ సినిమాలకు పని చేసిన సీనియర్ రైటర్ సాయి మాధవ్ బుర్ర డైలాగ్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ గురించి ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసాడు. NBK 111 ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అని.. నెక్స్ట్ లెవెల్‌లో సినిమా రూపొందుతుందని.. కచ్చితంగా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత కచ్చితంగా అందరూ షాక్ అవుతారు.
![]()
కేవలం బాలయ్య అభిమానులు మాత్రమే కాదు.. సినీ లవర్స్, సాధారణ ఆడియన్స్ సైతం సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఒకసారి సినిమా చూసి ఆగిపోవడం కాదు.. రెండు, మూడుసార్లు సినిమా చూసిన ఆశ్చర్యపోనవసరం లేదు. తనతో పాటు కొంతమందిని తీసుకెళ్లి సినిమా చూపించడం గర్వకారణంగా వాళ్ళు భావించేలా కంటెంట్ ఉంటుందంటూ ఎలివేట్ చేశాడు. ఆ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు గర్వంగా ఫీల్ అవుతారని సాయి మాధవ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయి మాధవ్ కామెంట్స్ వైరల్ అవ్వడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్నికంటుతున్నాయి. ఇక సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో చేస్తున్నాడట. ఒక పాత్రలో రాజుగా కనిపించనున్నాడట కదా.. అని అడిగితే ఈ విషయం నేను రివిల్ చేయకూడదు. డైరెక్టర్, ప్రొడక్షన్ టీం మాత్రమే చెప్పాలంటూ సాయి మాధవ్ సస్పెన్స్ క్రియేట్ చేసాడు. ఇక ఈ సినిమా ను చరణ్ పెద్ది మేకర్స్ వృద్ధి సినిమాస్ తెరకెక్కించనున్నాయి. ఇక NBK 111కు సైతం బాలయ్య ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పని చేయనున్నాడు.

