” మన శంకర వరప్రసాద్ గారు ” చిరు మూవీకి రావిపూడి వైబ్స్ (వీడియో)..

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంక్రాంతి ఎంత స్పెషల్ స్టేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ ఫ్యాన్స్‌కు మరింత పూనకాలు ఖాయమని.. డోస్‌ ఇంకా గట్టిగా ఉండబోతుంది అంటూ తెలుస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అనిల్ మార్క్ కామెడీ.. చిరు మార్క్ స్వాగ్‌తో థియేటర్లో రచ్చ రంబోలా కాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కౌంట్ డౌన్ అయిపోయింది. ఈ క్రమంలోనే.. తాజాగా ఫ్యాన్స్‌కు మరింత ఊపు పెంచేలా.. మేకర్స్‌ క్రేజీ అప్డేట్‌ను రివిల్ చేశారు. సినిమా రిలీజ్‌కు ఇంకా 25 రోజులు మిగిలి ఉంది.

ఈ అకేషన్‌లో టీం.. ఒక స్పెషల్ బిహైండ్ ది సీన్ వీడియోను వదిలారు. మామూలుగా ఇలాంటి వీడియోలు కష్టపడుతూ పని చేయడమే కనిపిస్తుంది. అలాంటిది.. ఈ సినిమా సెట్స్ లో మాత్రం ప్రతి ఒక్కరూ ఫుల్ గా ఫ‌న్ ఫీల్ అవుతూ.. ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ కనిపించాయి. అక్కడ షూటింగ్ జరుగుతున్నట్టు కాదు.. ఏదో ఫ్యామిలీ గెట్ టు గెదర్‌ల ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఈ వైబ్‌ చూస్తుంటేనే.. సినిమా ఎంత ఫన్నీగా ఉండబోతుందో తెలుస్తుంది. ఇక.. వీడియోలో మెగాస్టార్ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. చాలా రోజుల తర్వాత చిరుని ఇలాంటి వింటేజ్ లుక్‌లో చూడడం ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్‌ను ఇచ్చింది. చిరుతో అనిల్ కలిసి సెట్స్‌లో చేసిన అల్లరి అందర్నీ ఆకట్టుకుంది. ప్రతి షార్ట్ గ్యాప్ లోను.. న‌వ్వులు పూయిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Chiranjeevi and Venkatesh Celebrate Mega Victory from Mana Shankara Vara Prasad Garu

ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం ఈ వీడియోలో చిల్ అవుతూ చాలా సరదాగా మూవ్ అయినా విజువల్స్ చూడొచ్చు. చిరంజీవి, నయనతార మ‌ధ్య‌న బాండ్ సూపర్‌గా కుదిరింది. కేవలం మెయిన్ లీడ్‌గానే కాదు.. సెట్స్ లో కూడా ప్రతి ఆర్టిస్ట్ వర్క్‌ ప్రెజర్ లేకుండా ఫీల్ అయ్యేలా అనీల్‌ డిజైన్ చేశాడట. అనీల్ సీన్స్‌ను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే.. సెలబ్రిటీస్ పక్కపక్కా నవ్వుతున్న వీడియో చూస్తుంటే సినిమాలో మరెంత‌ ఫ‌న్‌ ఉంటుందో అనే ఆసక్తి ఆడియన్స్‌లో మొదలైంది. ఇక.. జనవరి 12న‌ థియేటర్‌లో సినిమా చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ తాజాగా మేకర్స్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు.. అసలైన హైలెట్ విక్టరీ వెంకటేష్ క్యామియో. సినిమాలో చిరు, వెంకీ మామ కాంబినేషన్ సీన్స్ అయితే డబల్ కిక్ ఇస్తాయని.. అటు మెగా, ఇటు దగ్గుపాటి అభిమానులకు పండగే అంటూ తెలుస్తుంది. మొత్తానికి ఈ షూట్‌ వీడియో నెటింట‌ తెగ సందడి చేస్తుంది. మీరు ఓ లుక్ వేసేయండి.