సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాలో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగనుంది. ఇక.. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రతో పాటు.. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో మెరవనున్నారు. ఇలాంటి క్రమంలోనే.. మహేష్ కెరీర్‌లో ఓ సినిమా మైల్ట్ స్టోన్‌గా నిలిచిపోయిందంటూ టాక్ వైరల్ గా మారుతుంది.
అంతేకాదు.. ఆ ప్రాజెక్టును చరణ్, తారక్ ఇద్దరు రిజెక్ట్ చేసిన తర్వాత అవకాశం మహేష్ కు వెళ్ళిందట. చివరకు ఆ సినిమా బ్లాక్ పాస్టర్ సక్సెస్ అందుకుని రికార్డులు క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏంటో.. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. డైరెక్టర్ కొరటాల శివ మిర్చి సినిమా తర్వాత ఎన్టీఆర్ కోసం ఒక మంచి కథను రాసుకున్నాడట. కానీ.. ఆ టైంలో వరుస కమిట్మెంట్స్‌తో ఎన్టీఆర్ సినిమాను చేయలేనని రిజెక్ట్ చేశాడు.
తర్వాత.. అదే సినిమా కోసం చరణ్‌ను అప్రోచ్ అయ్యాడు కొరటాల. చరణ్ సైతం పలు కారణాలతో ఆ ప్రాజెక్ట్‌ను వదులుకున్నాడు. ఇక అదే కథను.. మహేష్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి.. ఆయనకు వినిపించాడట కొరటాల. మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అదే శ్రీమంతుడు మూవీ. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సక్సెస్ అందుకుందో తెలిసిందే. 2017 ఆగస్టు 7న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. మహేష్ కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.


