టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 5 దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 22కు 70 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న ఆయన.. ఈ వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన నటన, డ్యాన్స్, గ్రేస్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే.. మెగాస్టార్ నుంచి దాదాపు రెండేళ్లగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. రాబోయే 2026లో మాత్రం చిరంజీవి నుంచి వరుసగా రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో మొదటిది జనవరి 12న వస్తుంది. అదే.. మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక దాదాపు రెండేళ్ల నుంచి రూపొందుతున్న విశ్వంభర సినిమాను కూడా 2026 లోనే రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు టీం.
అయితే.. రెండేళ్లుగా మెగాస్టార్ నుంచి ఈ గ్యాప్‌ను ఫిల్ చేయడానికి మెగాస్టార్ ప్రాజెక్ట్‌ల విషయంలో స్పిగ్ పెంచినట్లు తెలుస్తుఏది. మన శంకర్ వరప్రసాద్ గారు, విశ్వంభర సినిమాలతో పాటు.. మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నడట. అవి కూడా 2027లో కంప్లీట్ చేసి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. చిరంజీవికి ఇప్పటికే వాల్తేరు వీరయ్య లాంటి బంపర్ హిట్ ఇచ్చిన బాబి డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీని 2027 సంక్రాంతిలో రిలీజ్ చేయాలని టీం ఇప్పటికే ఫిక్స్ అయిపోయారట.

ఈ సినిమాతో పాటు శ్రీకాంత్ ఓద్దెల డైరెక్షన్‌లో చిరు నటించిన సినిమా కూడా 2027లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం.. శ్రీకాంత్.. నాని ది ప్యారడైజ్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పనులు కంప్లీట్ కాగానే.. చిరంజీవితో సినిమాను ప్రారంభించి వీలైనంత త్వరగా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే.. చిరంజీవి అనుకున్న టైం కు సినిమాలు రిలీజ్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ లో పండగ వాతావరణం నెలకొంటుంది అనడంలో సందేహం లేదు. మరి చిరు తన ప్లానింగ్ తో ఏ రేంజ్ లో సక్సెస్ కొడతాడో చూడాలి.

