తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతమంది స్టార్ హీరోస్ నటనతో పాటు.. బుల్లితెరపై హోస్టులుగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున, బాలకృష్ణ, రానా, జగపతిబాబు ఇలా ఎంతోబంది స్టార్స్ రియాలిటీ షోలకు హోస్ట్‌లుగా పని చేశారు. ఈ క్రమంలోనే.. తాజాగా మరో టాలీవుడ్ క్రేజీ హీరో ఈ లిస్ట్‌లోకి చేరబోతున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. సిద్దు జొన్నలగడ్డ. తను ఎంచుకునే కథలతో పాటు.. నటనలో సహజత్వంతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే సిద్ధు.. ప్రతి సినిమా విషయంలోను పాత్రలో డెప్త్ కారణంగా.. యూత్ నుంచి ఫామిలీ ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ వచ్చాడు.
చివరిగా తెలుసు కదా లాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్ పలకరించాడు. ఇక.. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ మరో జాక్పాట్ ఆఫర్ కొట్టేసాడు అనే టాక్ వైరల్‌గా మారుతుంది. అదేంటంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థతో సిద్దు జొన్నల గడ్డ.. తాజాగా ఓ భారీ డీలింగ్ చేసుకున్నాడట. ఇప్పటికే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు కూడా ముగిస్తాయని సమాచారం. అంతేకాకుండా.. తనదైన స్టైల్‌తో ఆడియన్స్‌ను మెప్పించిన సిద్దు.. ఇప్పుడు హోస్ట్‌గా మారనున్నాడని.. బాలయ్య అన్‌స్టాపబుల్ తరహా లోనే అదిరిపోయే నాన్ ఫ్రిక్షన్ షోను సిద్ధూ జొన్నలగడ్డ హోస్ట్ చేయబోతున్నట్లు సమాచారం.
సెలబ్రిటీతో ఇంట్రాక్ట్ అవుతూ.. ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను రూపొందించనున్నడట. ఈ మేరకు సిద్ధులు గడ్డతో ఓ బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ఫారం డీలింగ్ కూడా కుదుర్చుకుందని చర్చలు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. అది సంక్రాంతి నాటి నుంచి పండగ సీజన్ టార్గెట్ చేసుకుని భారీ లెవెల్ లో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షోలో.. హోస్టింగ్ విధానం కూడా సరికొత్తగా ఉండనుందని.. తెలంగాణ యాస, భాష ఉట్టిపడేలా నాచురల్ గా షోను కొనసాగించినట్లు సమాచారం. ఇప్పటికే.. ఎన్నో సినిమాల్లో తన డిఫరెంట్ స్లాంగ్‌తో సిద్ధు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు.. అదే తెలంగాణ యాసతో హోస్టింగ్ కూడా చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో అనే ఆసక్తి ఆడియన్స్‌లో మొదలైంది. ఇక షో రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారి క్లిక్ అయితే.. ఓటీటీ లో టిఆర్పి రేటింగ్స్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం అనడంలో సందేహం లేదు.


