బన్నీ – అట్లీ కాంబో టీజర్ కు ముహూర్తం ఫిక్స్ స్పెషల్ డేనే..

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి సాలిడ్ హిట్ తర్వాత అట్లీ డైరెక్షన్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ప్రస్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాను సన్ పిక్చర్ బ్యాన‌ర్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే.. వీళ్ళిద్దరి కాంబినేషన్ పై ఇండస్ట్రీ వర్గాల‌లో భారీ హైప్‌ మొదలైంది. సైన్స్ ఫ్రిక్షన్, యాక్షన్, ఫాంటసీ అంశాలతో గ్రాండ్ లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమా.. స్టోరీ పరంగాను కచ్చితంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని.. మునుపెన్నడూ లేని సరికొత్త తరహాలో కొత్త కాన్సెప్ట్‌తో సినిమాను స్క్రీన్ పై ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

92+ Thousand April 8 Royalty-Free Images, Stock Photos & Pictures | Shutterstock

ఈ మూవీలో బ‌న్నీ ఏకంగా మూడు డిఫరెంట్ రోల్స్‌లో మెరవ‌నున్నాడట. త‌న కెరీర్‌లోనే ఇదో కొత్త ప్రయోగం అని చెప్పాలి. ఇక.. ఈ మూడు పాత్రల కోసం దీపిక పదుకొనే, మృణాల్‌ ఠాకూర్, జాన్వి కపూర్లను హీరోయిన్లుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వీళ్ళతో పాట్టే.. భారీ స్టార్ కాస్టింగ్ కూడా సినిమాలో పనిచేయనున్నారట. గ్రాండ్ విజువల్స్‌తో.. పాన్ ఇండియా ఆడియన్స్‌ను క‌చ్చితంగా ఆకట్టుకునేలా కంటెంట్ ప్లాన్ చేశాడు. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ బిగ్‌ అప్డేట్ వైరల్ గా మారుతుంది. సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ సిద్ధమయ్యారట.

AA22: 250 Cr On Graphics, But Can Atlee Handle? | AA22: 250 Cr On Graphics, But Can Atlee Handle?

అంతేకాదు.. సినిమా టైటిల్, టీజర్ను ఏప్రిల్ 8న రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తున్నారట. ఆరోజు అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో ఆ స్పెషల్ డే ని పర్ఫెక్ట్ టైమ్ అని టీం భావిస్తున్నట్లు తెలుస్తుంది. గ్లింప్సే కాదు.. సినిమాలోని కీలక పాత్రల లుక్స్, క్యారెక్టర్స్ కూడా రివీల్ చేసే అవకాశం ఉందట. ఇక ఏదేమైనా వీళ్ళిద్దరి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్ కాదు.. పాన్ ఇండియా మార్కెట్లో రికార్డులు క్రియేట్ చేయడం కాయ‌మంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే.. టీజర్ రిలీజ్ డేపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. మ‌రి ఈ గ్లింప్స్‌ ఆడియన్స్‌లో సినిమా పై అంచనాలను ఎంతలా పెంచుతాయో చూడాలి.