టాలీవుడ్ లో ప్రజెంట్ ఎక్కడ చూసినా బుచ్చిబాబు సన్న పేరు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా సూపర్ సక్సెస్‌తో స్టార్ హీరోల దృష్టిని ఆకట్టుకున్నాడు. పాపులర్ దర్శకుల లిస్ట్‌లోకి చేరిపోయాడు. ఉప్పెన తర్వాత చాలా కాలం బ్రేక్ తీసుకున్న బుచ్చిబాబు.. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. కథ మొత్తం సిద్ధం చేసి.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఏవో కారణాలతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో.. బుచ్చిబాబు అదే కథను మరింత మాస్ లెవెల్‌లో మలుచుకొని.. రామ్ చరణ్ క్యారెక్టర్ ట్రై చేసిన సినిమాకు తగ్గట్టుగా ఎలిమెంట్స్ ను జోడించి కథను రూపొందించాడు అదే పెద్ది.
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు ముగిసాయట. ఈ క్రమంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇతర టెక్నికల్ వ్యవహారాలన్నీ వీలైనంత వేగంగా ముగించుకొని.. 2026 మార్చి 27న చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇదే రోజున పెద్ది థియేటర్లలో సందడి చేస్తాడు. ఇలాంటి క్రమంలోనే.. బుచ్చిబాబు, చరణ్ తర్వాత చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ హీరో కూడా కన్ఫామ్ అయిపోయినట్టు టాక్ ఒకటి వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవ్వరు అస్సలు ఊహించలేరు.

ఇంతకీ ఆ ప్రాజెక్ట్ బ్యాక్ డ్రాప్, హీరో డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. చరణ్ తర్వాత బుచ్చిబాబు తో పని చేయబోతున్న ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. మాస్ మహారాజ్ రవితేజ. ప్రస్తుతం తన 75వ సినిమా మాస్ జాతర ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న రవితేజ.. ఈ సినిమా పనులన్నీ కంప్లీట్ అయిన వెంటనే బుచ్చిబాబు డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇది పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. రవితేజ లోని అసలైన మాస్ ఎనర్టిక్ క్యారెక్టర్ ను బయటకు తీసి.. ఓ రేంజ్‌లో రవితేజను ఎలివేట్ చేసేలా బుచ్చిబాబు కథను సిద్ధం చేస్తున్నారని.. ఇక బుచ్చిబాబు, రవితేజ మూవీ అంటే ఆడియన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయని కాంబో.. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ కలిస్తే తెరపై ఏ రేంజ్ లో మాస్ ఎలివేట్ అవుతుందో అని ఆసక్తి ఆడియన్స్‌లో మొదలైంది. ఈ క్రమంగానే సోషల్ మీడియా వేదిక రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం అవుతున్నాయి.


