2025: ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన టాప్ 10 ఇండియన్ సినిమాలు ఇవే…!

ఇటీవల కాలంలో పాన్ ఇండియన్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే.. ఓపెనింగ్స్ తోనే తమ సత్తా చాటుకుంటున్నాయి. అలా ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్న టాప్ 10 సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

Coolie Review, Coolie Movie Review

కూలి:
లోకేష్ కనకరాజు డైరెక్షన్లో.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151.90 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది.

They Call Him OG - Wikipedia

ఓజీ:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఒజీ. ఇప్పటికి థియేటర్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.145 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని రెండవ స్థానాన్ని దక్కించుకుంది.

Game Changer (film) - Wikipedia

గేమ్ ఛేంజర్‌:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. శంకర్ డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. అయిన‌ప్ప‌టికి సినిమాపై హైప్‌రిత్య‌ రిలీజై ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.92.25 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.

Kantara: Chapter 1 Movie Review: Visually stunning and compelling film  traces the bloodlines of myth and power

కాంతారా చాప్టర్ 1:
రిషబ్ శెట్టి హీరోగా.. తానే దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.87.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకుంది.

War 2 Teaser Review: The Siddharth Anand Magic seems missing

వార్ 2:
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల‌ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.86.50 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది.

Hari Hara Veera Mallu - Part 1 Sword vs Spirit (2025) - Movie | Reviews,  Cast & Release Date in Khammam- BookMyShow

హరిహర వీరమల్లు:
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.70 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది.

L2: Empuraan - Wikipedia

ఏంపురాన్:
మోహన్‌లాల్ హీరోగా.. నటుడు పృధ్వీరాజ్ సుకుమారం డైరెక్షన్లో తెర‌కెక్కిన ఎంపురాన్‌ సినిమాకు ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.67. 35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతమయ్యాయి.

Daaku Maharaaj - Wikipedia

డాకు మహారాజ్:
నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. బాబి కొల్లి డైరెక్షన్లో డాకు మహారాజ్ ఫస్ట్ ప్రపంచ వ్యాప్తంగా రూ.51.8 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.

Good Bad Ugly box office collection day 4: Ajith Kumar starrer collects Rs  150 crore

గుడ్ బాడ్ అగ్లీ:
అజిత్ హీరోగా, అధిక రవిచంద్రన్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.51.50 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది.