టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సాహో సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజి. ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది. ఇలాంటి క్రమంలో పవన్ సినిమా టార్గెట్ లెక్కలు మారుతున్నాయి. పవన్ ఎదట ప్రస్తుతం ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఇక ఆ లక్ష్యాలు అన్నింటినీ సినిమాతో బ్లాస్ట్ చేస్తాడా.. లేదా.. ఇంతకీ ఆ టార్గెట్ ఏంటో ఒకసారి చూద్దాం. తాజాగా ఓజీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని.. యూ\ఏ సర్టిఫికెట్ దక్కించుకుంది. అంతేకాదు.. అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్.. బ్లాక్ బస్టర్ అంటూ టాక్ కూడా వచ్చింది.
దసరా హాలిడేస్ సినిమాకు మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు.. రికార్డుల ఊచకోత నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దానికి తోడు టికెట్ రేట్ లు పెంచుకునే అవకాశం తెలుగు రాష్ట్రాలు కల్పించాయి. ఇలా.. పవన్ కు అన్ని రకాలుగా కలిసి వచ్చేసింది. ఇక సినిమాపై ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 21, 10గం 8 నిమిషాలకు రిలీజ్ కానున్న ట్రైలర్తో దీనిపై అంచనాలు మరింత పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. ఇలాంటి క్రమంలో ఓజీ పవన్ టార్గెట్ మొదటి రోజు 100 కోట్లు.. ఇప్పటివరకు ఉన్న స్టార్ హీరోలంతా వంద కోట్ల ఓపెనర్‌లుగా నిలిచారు. కేవలం పవన్‌కు మాత్రమే ఆ రికార్డ్లు దక్కలేదు.
తాజాగా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సైతం రూ.70 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి హైయస్ట్ ఓపెనర్గా నిలిచింది. ఈ క్రమంలోనే.. పవన్ ముందున్న ఫస్ట్ టార్గెట్ మొదటి రోజు 100 కోట్లు కొల్లగొట్టడం. ప్రస్తుతం ఉన్న క్రేజ్‌కు రూ.150 కోట్లు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక పవన్ పూర్తి చేయాల్సిన మరో టార్గెట్ రూ.100 కోట్ల షేర్ దక్కించుకోవడం. ఇప్పటివరకు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తో వందకోట్ల షర్టు దగ్గర వరకు వచ్చి పవన్ ఆగిపోయారు. ఇమేజ్ పెద్దదైన మిగిలిన హీరోలతో పోలిస్తే పవన్ మాత్రం కలెక్షన్ పరంగా వెనకబడ్డారని చెప్పాలి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నా.. ఓజీతో మాత్రం ఇప్పుడు ఆ రికార్డులన్నిటిని బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో రూ.200 కోట్ల క్లబ్ లోకి పవన్ చేరుకోవడం ఖాయమని సినిమా పాజిటివ్ టాక్ వస్తే 500 కోట్లు కొల్లగొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా వరల్డ్ వైడ్ టార్గెట్ రూ.800 కోట్లని తెలుస్తుంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత పవన్ తుఫాన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.