” ఓజీ “హైప్ కు హెల్త్ అప్సెట్.. 25 తర్వాత మా పరిస్థితి ఏంటో.. సిద్దు జొన్నలగడ్డ

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా, జనరల్ మీడియా అని తేడా లేకుండా ఎక్కడ చూసినా వరల్డ్ వైడ్ లెవెల్ లో ఒకటే మానియా కొనసాగుతుంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమా మ‌రో 4 రోజుల్లో గ్రాండ్‌గా పలకరించనుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక సినిమాని చూడడానికి కేవలం పావన్‌ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

OG: Other side of Play unleashed on PK B-Day | cinejosh.com

ఈ క్రమంలోనే.. పవన్ ఫ్యాన్స్ అప్పుడే థియేటర్ల దగ్గర సందడి మొదలు పెట్టేసారు. వరుస పోస్టర్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో టాలీవుడ్ రౌడీ బాయ్ సిద్దు జొన్నలగడ్డ.. పవన్ ఓజీ హైప్‌ మామూలుగా లేదుగా.. మా హెల్త్ ఎం అయిపోవాలి అంటూ చేసిన పోస్ట్ తెగ వైరల్ గా మారుతుంది. పవన్ ఫ్యాన్స్ దాన్ని మరింత ట్రెండిగా చేస్తున్నారు. సెప్టెంబర్ 25 వరకు మేము అసలు ఉంటామా.. పోతామో.. కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడే ఇలా ఉందంటే.. సెప్టెంబర్ 25 తర్వాత మా పరిస్థితి ఏమైపోతుందో పవన్ గారు.. మీరు పవన్ కాదు తుఫాన్ అంటూ సిద్దు జొన్నలగడ్డ షేర్ చేసుకున్నారు.. దీన్ని డైరెక్టర్ సుజిత్ కు ట్యాగ్ చేస్తూ ఓజి ఓ అద్భుతం అంటూ రాసుకొచ్చాడు.

ప్రస్తుతం ఇదే పోస్ట్‌ను పవన్ ఫ్యాన్స్ తెగ ట్రైండ్‌ చేస్తున్నారు. ఇక మరో ప‌క్క‌ టీం సినిమాకు సంబంధించిన రోజుకో అప్డేట్ ని షేర్ చేస్తూ సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచేస్తున్నారు. అలా.. తాజాగా పవన్ స్వయంగా పాడిన వాషి యో వాషి.. అనే సాంగ్ చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకో చెబుతా విను అంటూ జపనీస్ భాషలో పవన్ పాడిన ఈ సాంగ్.. క్షణాల్లో తెగ ట్రెండింగ్‌గా మారింది. ఇక ప్రస్తుతం అందరి దృష్టి కేవలం ట్రైలర్ పై ఉంది.ఈ నెల 21.. న‌10 గంటల 8 నిమిషాలకు ఈ ట్రైల‌ర్‌ రిలీజ్ చేయనన్నారు టీం. దీంతో సోషల్ మీడియాతో పాటు జనరల్ మీడియా కూడా దద్దరిల్లిపోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఏపీ, తెలంగాణలో స్పెషల్ షోస్ అలాగే టికెట్ హైక్ కు అనుమతి కూడా వచ్చేసింది. ఈ క్రమంలో సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత మొదలైపోతుంది.