మొన్న నాని, నిన్న నితిన్.. ఎల్లమ్మ ప్రాజెక్ట్ లో అసలేం జరుగుతుంది..?

తెలుగు టాప్ ప్రొడ్యూసర్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు దిల్ రాజు. ఇప్పటివరకు ఆయన తెర‌కెక్కించిన దాదాపు అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్న క్రమంలో.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే.. ఆయన నుంచి రానున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ. ఇప్పటికే బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు ఎల్దండి.. ఎల్లమ్మ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించినన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పనుల్లో బిజీ అయ్యాడు వేణు. కాగా.. గతంలో ఈ సినిమా కోసం నానిని హీరోగా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. దీని అఫీషియల్‌గా కూడా ప్రకటించిన తర్వాత.. నాని సినిమా నుంచి తప్పుకున్నారు.

Nithiin grabs Yellamma from Nani | cinejosh.com

తర్వాత ఆయన ప్లేస్‌లో నితిన్ చేరాడు. ఇక నితిన్ ఈ సినిమా కోసం కసరతులు కూడా ప్రారంభించాడు. సినిమాకు అంతా సిద్ధం అనుకునే సమయంలో.. ఆయన కూడా సినిమా నుంచి తప్పుకున్నాడంటూ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. నితిన్ ప్లేస్‌లో ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో శర్వానంద్‌ను నటింపజేయాలని దిల్ రాజు భావిస్తున్నాడట. ఏదేమైనా.. ఈ సినిమా విషయంలో ఇంత‌మంది హీరోలు చేంజ్ అవ్వడానికి అసలు కారణమేంటి.. కథలో డెప్త్‌ హీరోలకు అర్థం కాలేదా.. లేదా సబ్జెక్టులు హ్యాండిల్ చేయలేర‌నే ఉద్దేశంతో నిర్మాతలే ఈ హీరోలను తప్పిస్తున్నారా.. అనేది హాట్ టాపిక్ గా మారింది.

Dil Raju & Sharwanand At Facebook Office Photos,Telugu Event

ఇక ఎల్లమ్మ ప్రాజెక్ట్‌ తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కుతుందని గతంలోనే క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే శ‌ర్వనంద్‌.. తెలంగాణ స్లాంగ్ మాట్లాడితే.. విలేజ్ కుర్రాడులా కనిపిస్తే అది వర్కౌట్ అవుతుందా.. సెట్ అవుతుందా.. అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఏదేమైనా దిల్ రాజు ఎందుకు ఈ ప్రాజెక్టులో ఇంతమంది హీరోలను చేంజ్ చేస్తున్నాడు. కాన్సెప్ట్‌లో తేడా ఉందా.. లేదా మరేదైనా సమస్య. ఇక చివరికి సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారు.. ఈ సినిమాతో ఎవరు ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటారు. డైరెక్టర్ గా వేణు మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టి తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తాడా.. లేదా.. తెలియాల్సి ఉంది.