పవన్ ఊతపదం ఏంటో తెలుసా.. ప్రతి ఈవెంట్లో కచ్చితంగా వాడాల్సిందే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల పరంగానే కాదు.. పొలిటికల్ పరంగాను సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం గా విధులను నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న పవన్.. మరో పక్క సినిమా సమయం దొరికినప్పుడలా సెట్స్‌లోను సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఇక మరో రెండు రోజుల్లో పవన్ బర్త్డే రానుంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అంతా ఇప్పటినుంచే సందడి మొదలు పెట్టేసారు. ఎప్పటిలా కాకుండా ఈ ఏడాది మరింత డిఫరెంట్ గా పవన్ బర్త్డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తూ.. తెగ ట్రెండ్ చేస్తున్నారు. సాధారణ ఆడియన్స్‌కే కాదు.. స్టార్ సెలబ్రిటీలకు, పొలిటిషన్‌ల‌కు.. ఇలా ఎవరికైనా సరే ఖచ్చితంగా ఊతపదం ఉంటుంది. సందర్భానికి సంబంధం లేకుండా ఏదో విష‌యంలో వాడేస్తూ ఉంటారు. రోజుకి కనీసం ఒక్కసారైనా ఆ పదాన్ని ఉప‌యోగిస్తారు. అలా పవర్ స్టార్ కు కూడా ఓ ఊత‌ప‌దం ఉందట‌. ఆయన ఏ ఈవెంట్‌లో అయినా.. పొలిటికల్ పార్టీలో అయినా కచ్చితంగా ఈ ఊతపదాన్ని వాడేస్తూ ఉంటాడట.

ఇంతకీ పవన్ కళ్యాణ్ ఊతపదం ఏంటి.. ఆయన తరచూ సందర్భం లేకుండా మాట్లాడే ఆ పదం ఒకసారి చూద్దాం. పవన్ తనకే తెలియకుండా ఎప్పుడు మాట్లాడినా.. ఖచ్చితంగా వాడే ఊతపదమే అరేయ్. ఆయన ఏదైనా ఎక్కువ కంటెంట్ ను మాట్లాడాలంటే.. కచ్చితంగా అరేయ్ పదాన్ని చాలా సార్లు వాడేస్తూ ఉంటాడట‌. ఈ విషయాన్ని ఫ్యాన్స్ ఇప్పోడు హైలెట్ చేస్తున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని లైక్లు, షేర్లు కొడుతూ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇక పవన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్‌కు స్టార్ హీరోకి ఉండే అభిమానం కాదు.. ఆయనను దేవుడులా పూజించే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి స్ట్రాంగ్‌ క్రేజ్, ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నాడు పవన్. ఇప్పుడు సినిమాల పరంగానే కాదు.. పొలిటికల్ పరంగాను తన పని తాను చేసుకుంటూ ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుంటున్నారు.