కూలీ ట్విట్టర్ రివ్యూ.. రజిని బ్లాక్ బస్టర్ కొట్టాడా..?

పాన్ ఇండియ‌న్ మోస్ట్ అవైటెడ్‌ మూవీ కూలి ఎట్టకేలకు ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైంది. నేడు గ్రాండ్ లెవెల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో రజనీకాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమా.. ఓవర్సీస్, ఆంధ్ర, తమిళనాడు ఇలా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. రజిని ఫ్యాన్స్‌తో పాటు చాలామంది మూవీ లవర్స్.. ఫస్ట్ షోనే చూసేయాలని తెగ అరాట‌పడిపోయారు. ఈ క్రమంలోనే భారీ లెవెల్ లో ఆన్‌లైన్‌ బుకింగ్స్ రికార్డ్‌ అయ్యాయి. అయితే.. ఇప్పటికే సినిమా పూర్తి అవడంతో సినిమాను చూసిన చాలామంది ఆడియన్స్ సినిమా పై తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఒకసారి సినిమా రివ్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం.

సినిమా రిలీజ్ కి ముందు టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ప్రతి ఒక్కదానితోను ఆడియన్స్ పీక్స్ లెవెల్ లో అంచనాలను నెలకొల్పినా.. మూవీ రిలీజ్ తర్వాత ప్రీమియర్ షోస్ తోను మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. మొదటి భాగం అదిరిపోయిందని.. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఆడియన్స్ కు బిగ్ సర్ప్రైజ్‌లా ఉందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వింటేజ్ లుక్ కింగ్ పిన్‌ సాంగ్ తో అదరగొట్టాడని.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్వెస్టిగేటివ్ పార్ట్ యావరేజ్ గా అనిపించినా.. రజినీకాంత్ ఆరా, ఎమోషనల్ సీన్స్ లో ఆయన పర్ఫామెన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లిందంటూ చెప్పుకొస్తున్నారు. మౌనిక సాంగ్ సినిమాకు హైలెట్ అని.. పూజా హెగ్డే తన పర్ఫామెన్స్ అదరగొట్టిందంటూ ఓ నేటిజన్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు.

ఫ‌స్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ అని.. ఇక లోకేష్ కనకరాజ్ టాలెంట్, అనిరుధ్‌ అదిరిపోయే బీట్స్, రజనీకాంత్ పర్ఫామెన్స్, ఆరా.. నాగార్జున రాయల్ పర్ఫామెన్స్ అన్ని.. సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లాయని.. ఈ సినిమా కేవలం హిట్ కాదు.. 200% మెగా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ మరో నెటిజ‌న్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరొకటి ఫస్ట్ అఫ్ అదిరిపోయింది. 100% లోకేష్ అదరగొట్టాడు.. ఫ్రేమ్ బై ఫ్రేమ్ తన మార్క్ కనిపించిందంటూ సినిమా ఫైర్ అనీ.. గూస్ బంప్స్ ఖాయం అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక యూకేలో ప్రీమియర్ షోను చూసిన మరో నెటిజ‌న్‌.. స్క్రీన్ పై అదిరిపోయింది అని.. సైమన్ గా నాగార్జున చాలా భయపెట్టేసాడు అంటూ.. లోకేష్ కనకరాజ్ త‌న‌ మార్క్ మరోసారి చూపించాడని.. అనిరుధ్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కొంతమంది ఇది రెగ్యులర్ ప్రోడెక్టబుల్ స్టోరీ అని అయినా.. లోకేష్ తనదైన స్టైల్ తో మార్క్ చూపించాడని చెప్తున్నారు. అంతేకాదు.. సినిమాలో మరో రెండు సర్ప్రైసింగ్ క్యామియో రోల్స్‌ కూడా ఉన్నాయట. ఇక ఫైనల్‌గా.. స్టోరీలో కొత్తదనం లేకపోయినా అంతా ముందే తెలుస్తున్న కూడా.. ఎక్కడ ఆ ఫీల్ కలగకుండా ఆడియన్స్ లో ఆసక్తిని పెంచేలా స్క్రీన్ ప్లే తో లోకేష్ మాయ చేసాడని చెప్తున్నారు. నాగార్జున, రజినీల మధ్య మౌస్ గేమ్ అదిరిపోయిందని.. కచ్చితంగా ఒక్కసారి థియేట‌ర్స్‌లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అని చెబుతున్నారు.