టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప రాజ్‌గా తిరుగులేని క్రేజ్.. పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక నేషనల్ క్రష్ రష్మిక శ్రీవల్లిగా పుష్ప మూవీలో తన నటనతో ఆకట్టుకుంది. వీళ్లిద్దరు తప్ప ఆ పాత్రలో మరెవ్వరు సెట్ కారు అనేంతలా ఒదిగిపోయి నటించి విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలెట్గా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఇక త్వరలోనే ఈ సక్సెస్ఫుల్ జోడి మరోసారి వెండితెరపై మెరవనుందట.
అట్లీ డైరెక్షన్‌లో బన్నీ హీరోగా.. ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు హీరోయిన్లు కావలసి ఉందట. ఈ క్రమంలోనే ఒక కథానాయకగా దీపికా పదుకొనే సెలెక్ట్ కాగా.. మరో రోల్ కోసం మృణాల్ ఠాగూర్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మూడో హీరోయిన్గా రష్మిక మందన నటించనుందట. మొదట్లో మూడో హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరు వినిపించిరా.. ఇప్పుడు ఆమె ప్లేస్‌లో రష్మిక మందన్న నటించనున్నట్లు టాక్ నడుస్తుంది.
ఇప్పటికే మేకర్స్ ఆమెను అప్రోచ్ కూడా అయ్యారని.. అన్ని కుదిరితే ఈ మూవీలో మరోసారి ఈ సక్సెస్ఫుల్ జోడి తెరపై సందడి చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ, అట్లీ కాంబోలో సినిమాపై రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. హాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోని ఇందులో కీలక పాత్ర కోసం సెలెక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను.. సన్ పిక్చర్స్ బ్యానర్ తెరకెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూట్ శరవేగంగా సాగుతోంది.