గేమ్ ఛేంజర్‌తో లైఫ్ స్పాయిల్‌.. అతనే మమ్మల్ని కాపాడాడు.. ప్రొడ్యూసర్

టాలీవుడ్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నటించాలని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ఎంతోమంది నటీనటులు కోరుకుంటూ ఉంటారు. ఇక‌ అంత క్రేజ్, ఇమేజ్ రావడానికి ప్రధాన కారణం దిల్ రాజు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ.. తెర వెనుక ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి క‌ష్టం కూడా అంతే ఉంటుంద‌ని సినీ వర్గాలు చెప్తుంటాయి. ఇక ఇప్పటికే వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు తెరకెక్కి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. వీరిద్దరు కలిసి ఆ బ్యానర్‌పై నిర్మించిన మూవీ గేమ్ ఛేంజర్. రామ్ చరణ్, శంకర్ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ వల్ల.. పడిన కష్టాల గురించి ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. గేమ్ ఛేంజర్ నష్టాలు దెబ్బకు లైఫ్ స్పాయిల్ అయిపోయింది అనుకున్నా.

కానీ.. సంక్రాంతికి వస్తున్నాంతో అంత మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. గేమ్ ఛేంజ‌ర్ గురించి శిరీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాతో మా బతుకు అయిపోయిందని భావించాం. అయితే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్ళీ నిలబడతామని నమ్మకం వచ్చేసింది. ఇదంతా కూడా కేవలం నాలుగు రోజుల్లో జరిగిపోయింది. ఈ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో అసలు ఊహించలేము. అప్పుడు అందరూ మా చాప్టర్ క్లోజ్ అయిపోయిందని హేళన చేసేవాళ్లు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అంటూ చెప్పుకొచ్చిన శిరీష్.. కనీసం సినిమా నష్టం వచ్చిందని డైరెక్టర్ గాని.. హీరో కానీ.. ఎవరు ఫోన్ చేయలేదు. చరణ్ కూడా కాల్ చేసి మాట్లాడలేదు. వాళ్ళని నేను త‌ప్ప‌ప‌ట్ట‌ను.

Producer says Game Changer ruined him financially

మాకు ఇష్టం ఉండి సినిమా తీసం. డబ్బు పోయింది. రెమ్యూనరేషన్‌లో కొంత ఇవ్వాలని ఎవరిని అడగలేదు. అంత స్థాయికి ఇంకా దిగజారిపోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. మమ్మల్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్స్ ను మేము కాపాడుకున్నాం. గేమ్ ఛేంజ‌ర్ పోయిందని చరణ్‌తో మాకేం విభేదాలు రాలేదు. మరో మంచి కథ వస్తే ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన సినిమా చెయ్యాలా.. లేదా అనేది ఆయన నిర్ణయం. ఇక ఈ వ్యాపారంలో ఎవరిని తప్పు పట్టం. ఇక గేమ్ ఛేంజ‌ర్‌తో వచ్చిన నష్టం చెప్పుకుంటే బాగోదు కానీ.. చాలా మొత్తంలో పోయింది. సంక్రాంతికి వస్తున్నాం దెబ్బతో 70% రికవరీ అయింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి లేకుంటే ఈరోజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఏ ఉండేది కాదంటూ శిరీష్ క్లారిటీ ఇచ్చాడు. మమ్మల్ని తిరిగి నిల‌బెట్టింది అనీల్ అని నేను న‌మ్ముతా అంటూ శిరీష్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.