” హరిహర వీరమల్లు ” రివ్యూ.. ఫాన్స్ కు అదిరిపోయే ఫిస్ట్..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతుందంటే ఎలాంటి పండగ వాతావరణం నెలకొంటుందో తెలిసిందే. ఈ క్రమంలోనే లాంగ్ గ్యాప్‌ తర్వాత హరిహర వీరమల్లు సినిమాతో ఆడియ‌న్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు ప‌వ‌న్‌. పిరియాడిక్ హిస్టారికల్ మూవీ గా రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ కు జంటగా మెరిసింది. బాబి డియోల్, సునీల్, బ్రహ్మాజీ, నాజార్‌, సుబ్బరాజు, అయ్యప్ప సర్మ‌ కీలక పాత్రలో, కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

జ్యోతి కృష్ణ, కృష్ డైరెక్షన్లో సంయుక్తంగా రూపొందిన ఈ సినిమాకు ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక.. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ నుంచి వచ్చిన మొదటి సినిమా కావడంతో సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కొద్ది గంటల క్రితం సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ఇప్పటికే ప్రీమియర్స్ ముగ్గించుకుంది. ఇక ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే వీరమల్లు అందరిని ఆకట్టుకున్నాడా.. లేదా.. తెరపై ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేశాడో ఒకసారి చూద్దాం.

స్టోరీ:
మొగల్ చక్రవర్తులు, ఔరంగజేబు కాలం నాటి బ్యాడ్ డ్రాప్ తో స్టోరీ మొదలైంది. ఔరంగ్ జేబ్‌.. ధిల్లీ పీఠంపై కూర్చుని దురాగతలకు పాల్పడుతూ.. పేదవాళ్ళను దోచుకుంటూ.. మతమార్పిడి కోసం బలవంతం చేస్తాడు. అందుకు ఒప్పుకోకుండా హిందువులుగా జీవించే వాళ్లకు జిజియా పన్నును విధించి వాళ్ళను ఇబ్బంది పడుతుంటాడు. ఈ క్రమంలోనే ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్న.. వాళ్ళని పట్టించుకోకుండా తెల్లదొరలా సంపాదన దోచుకుంటాడు. ఇక తనకు అనుకూలంగా కొంతమంది రాజులు, అనుచరులు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ వీరమల్లు (పవన్ కళ్యాణ్) అంటే వ‌ణుకు. వీరమల్లు ఒక మంచి దొంగలా కనిపిస్తాడు.

పెద్ద వాళ్ల దగ్గర దోచుకుని.. పేదవాళ్లకు పంచి పెడుతూఉంటాడు. అలా.. బందర్ నుంచి హైదరాబాద్ నవాబ్.. కుతుబ్ షాహీ దగ్గరకు తీసుకు వెళుతున్న వజ్ర‌లపై వీరమల్లు కన్నేసి తన బలగంతో చార్మినార్ వరకు వెళ్లి.. వజ్రాలను దొంగలిస్తాడు. అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ.. ఢిల్లీలో ఔరంగ్ జైబ్‌ సింహాసనం పై ఉన్న కోహినూర్ వజ్రాని.. తన వద్దకు తీసుకొచ్చే బాధ్యతను అప్పగిస్తాడు. వీరమల్లు ఏ కారణాలతో దానికి ఒప్పుకుంటాడు.. ? హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో త‌న‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి..? ఈ కథలో పంచమి (నిధి అగర్వాల్) పాత్ర ఏంటి..? అసలు తనకి వీరమల్లుకు.. ఆమెతో సంబంధమేంటి..? శత్రువుల సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా అడుగుపెట్టాడు..?ఈ విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

రివ్యూ:
మూవీ అయిన సెట్స్‌పై ఎక్కువ కాలం ఉందంటే అవుట్ డేటెడ్ అయిపోయి.. దానిపై హైప్‌ తగ్గిపోతుంది. ఎంతగా ప్రయత్నించినా సినిమా వర్కౌట్‌ అవ్వడం కష్టమే. అలాంటిది పవన్ కళ్యాణ్ వీరమల్లు 5ఏళ్లు సెట్స్‌పై ఉన్న‌ సినిమాపై మరింత క్రేజ్ నెలకొంది. ఇక ప్రస్తుతం ట్రెండింగ్‌ టాపిక్ గా ఉన్న సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ.. ఈ సినిమాను రూపొందించడం మ‌రింత ప్ల‌స్ అయ్యింది. రాబిన్ హుడ్ త‌ర‌హా ప‌వర్‌ఫుల్ రోల్‌లో ఆడియన్స్‌కు గూస్ బంప్స్‌ తెప్పించే ఎలివేషన్స్ తో పవన్ ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే స్వధర్మం బ్యాక్ డ్రాప్‌తో సినిమా రూపొందడం మరింత ప్లస్ అయింది. ఇక స్టోరీని గత కొంతకాలంగా పవన్ ప్రతి ఈవెంట్లో చెప్తూనే ఉన్నాడు. కోహినూర్ డైమండ్ కోసం వీర‌మ‌ల్లు ప్రయాణం.. ఈ జర్నీలో ఎదురయ్యే సమస్యలు గురించి రూపొందింది. వీరమల్లు పాత్రని అతని, వీరత్వాన్ని ఆడియన్స్ కు పరిచయం చేస్తూ సాగే ఫస్ట్ అఫ్ సినిమాకు హైలైట్.

Hari Hara Veera Mallu: Pawan Kalyan's Hari Hara Veera Mallu Drops New..

సెకండ్ హాఫ్ ఫ్రీ క్లైమాక్స్ అదిరింది. ఇక 16వ దశాబ్దం నాటి పరిస్థితులన్నింటికీ అర్థం పట్టేలా సినిమాను ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దారు. వరద కారణంగా తల్లిదండ్రుల నుంచి దూరమైన ఓ అనాధ.. వీరమల్లు. సత్యరాజ్ కుటుంబానికి దొరుకుతాడు. అలా పవన్ ఎంట్రీ ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి సినిమాను పరుగులు పెట్టించారు.ఫ‌స్ట్ హాప్‌ యాక్షన్ సీన్స్, సాంగ్స్ అంద‌రిని ఆక‌ట్టుకునేలా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఫైట్ ఎలివేషన్స్ ప్రేక్షకులను మరింత మెప్పిస్తాయి. తర్వాత మల్లయోధులతో కంటిన్యూస్గా చార్మినార్ దగ్గర వరకు సాగే పోరాట సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కొల్లగొట్టినదిరో సాంగ్‌తో ఫస్ట్ హాఫ్ సినిమా అంచనాలను మించిపోయేలా సాగింది.

ఇక ఇంటర్వెల్‌కు ముందు వచ్చే కుతుబ్‌షాహీ కోటలోని సన్నివేశాలు మరింత ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్‌లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తీర్చిదిద్దారు. అయితే.. కొన్నిచోట్ల ఆడియన్స్ ఆసక్తిని చూపిన రేంజ్‌లో కథ‌, కథనాలు లేకపోవడం.. సన్నివేశాలు సాగదీతగా అనిపించడం.. సినిమాకు కాస్త లోటు. పవన్ స్వయంగా తీర్చిదిద్దిన యాక్షన్ ఎపిసోడ్ నుంచి మళ్లీ సినిమా ట్రాక్ లోకి వచ్చింది. యాక్షన్ సన్నివేశాలతో పాటు.. సనాతన ధర్మానికి సంబంధించిన సీన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాయి. అయితే క్లైమాక్స్ సన్నివేశాలు ఆడియన్స్‌లో మరింత జోష్ పెంచాయి. విజువల్స్ తో మాయ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ముగించారు.. రెండో భాగం యుద్ధ భూమిక రూపొందించనున్నారు.. అసలైన యాక్షన్ అప్పుడే చూడాలని చెబుతూ కథ పూర్తి చేశారు.

నటీనటుల పర్ఫామెన్స్:

పవన్ కళ్యాణ్ నటించిన ఫస్ట్ పిరియాడికల్ యాక్షన్ డ్రామా కావడం.. ఇప్పటివరకు ఇలాంటి హిస్టారికల్ రోల్‌లో పవన్ ఒక్కసారి కూడా కనిపించకపోవడంతో ఈ యాక్షన్ హిస్టారికల్ మూవీలో పవన్ ఎలా కనిపిస్తాడో.. ఫైట్ సీన్స్ ఎలా ఉంటాయో.. డైలాగ్స్ ఎలా ఆకట్టుకుంటాయో.. అనే సందేహాలు ఆడియన్స్‌లో ఉండేవి. వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ.. వీర‌మ‌ల్లు పాత్రలో జీవించేసాడు పవన్. ఆయన కనిపించిన విధానం.. చూపించిన హీరోయిజం, యాక్షన్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచాయి. ఎంత కాలం నుంచి సినిమా షూట్ కొనసాగుతున్నా.. లుక్‌లో మాత్రం ఎక్కడ డిఫరెన్స్ కనిపించకుండా బాగా బ్యాలెన్స్ చేశారు.

సనాతన ధర్మం సాగే సీన్స్ అన్నిటిలో పవన్ తన ఆలోచనలను కళ్ళకు కట్టినట్లు చూపించాడు. నిధి అగర్వాల్ పంచమి పాత్రలో మెప్పించింది. కొల్లగొట్టినాదిరో, తార తార సాంగ్స్ లో అమ్మడు మరింత గ్లామర్‌తో ఆకట్టుకుంది. లుక్‌లో కూడా తేడా కనిపించకుండా బ్యాలెన్స్ చేసింది. ఔరంగ జేబ్‌ పాత్రలో బాబీ డిఈఓ కనిపించిన తీరు మెప్పిస్తుంది. కాగా.. ఫస్ట్ హాఫ్‌లో కనిపించిన అంత స్పిడ్‌ సెకండ్ హాఫ్ లో కనిపించలేదు. దివంగత న‌టుడు కోటా శ్రీనివాస్ చిన్న పాత్రలో మెరిశాడు. ఇక మురళి శర్మ, సచిన్ కేడ్కర్ తదితరులు కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. సునీల్, బ్రహ్మాజీని, నాజార్‌, సుబ్బరాజు, అయ్యప్ప శ‌ర్య‌ పవన్ కళ్యాణ్ టీం గా కనిపించారు. అనసూయ, పూజిత పొన్నాడ ఓ సాంగ్ లో మెరిశారు.

ది రాజాసాబ్ మూవీలో నిధి అగర్వాల్ దెయ్యం రోల్ లో కనిపిస్తారా.. అసలు నిజాలివే

టెక్నికల్ గా:
సినిమాకి కీరవాణి మ్యూజిక్ హైలెట్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు కొత్త ఊపునిచ్చింది. సంగీతం తోనే హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. సాంగ్స్ అన్ని ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన జ్ఞాన శేఖర్, మనోజ్ పరమహంస విజువల్స్‌తో మెప్పించారు. సినిమాకు దర్శకులుగా జ్యోతి కృష్ణ, కృష్‌ ఇద్దరు వ్యవహరించినా.. చెప్పాలనుకున్న కథ, కథనాలను క‌న్‌ఫ్యూజ‌న్ లేకుండా.. క్లారిటీగా చూపించారు. జనం మెచ్చిన సైనికుడు జనసైనికుడు అవుతాడు.. పాలించే వారి పాదాలే కాదు తల కూడా అందరికీ కనిపించాలంటూ పవన్.. రాజకీయ జీవితని ప్రతిబింబించేలా చెప్పిన పలు డైలాగ్స్ ఫ్యాన్స్ పండ‌గ‌లా అనిపించాయి. సాయి మాధవ్ బుర్ర అండ్ కో.. నిర్మాణ విలువలు క్లియర్ గా తెలుస్తున్నాయి.

ప్లస్ లు, మైనస్ లు:
సినిమాకు ప్రధాన బలాలుగా పవన్ కళ్యాణ్ నటన నిలవగా.. కీరవాణి మ్యూజిక్ పవన్ ఎలివేషన్స్ కి, సాంగ్స్ కి ప్రాణం పోసింది. ఇక యాక్షన్ సీన్స్ ఫ్రీ క్లైమాక్స్ సీన్స్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. స్టోరీలో కొత్తదనం కనిపించకపోవడం సినిమాకు కాస్త మైనస్. విజువల్ ఎఫెక్ట్స్ కూడా మరింత మెరుగగా ఉంటే బాగుండేది.

ఫైనల్ గా: వీరమల్లు ఒక్కసారి థియేటర్ లో చూడొచ్చు.. ఇక పవన్ ఫ్యాన్స్ కైతే మూవీ మంచి ఫిస్ట్.