” హరిహర వీరమల్లు ” ఓటీటీ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ.. చూడొచ్చంటే..?

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఆయన ఏపి డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వచ్చిన మొదటి సినిమా కావడం ఆయన కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో.. సినిమాపై ఆడియ‌న్స్‌లో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. నీధి అగర్వాల్ హీరోయిన్గా, బాబీ డియొల్ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు.. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. క్రిష్‌ జాగర్లమూడి డైరెక్షన్‌లో ప్రారంభమైన ఈ సినిమా జ్యోతి కృష్ణ డైరెక్షన్లో ముగిసింది. పిరియాడిక్ హిస్టారికల్ మూవీగా కోహినూర్ డైమండ్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా తెరకెక్కింది. ఇక కొద్ది గంటల క్రితం సినిమా రిలీజై ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.

Prime Video - App on Amazon Appstore

కేవలం ప్రీమియర్ షోల ద్వారానే బ్లాక్ బ‌స్టర్ లెవెల్‌లో కలెక్షన్లు కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ క్ర‌మంలోనే సినిమా ఓటీటీ డీల్‌కు సంబంధించిన న్యూస్ వైరల్‌గా మారుతుంది. సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పటికే లాక్ అయిపోయిందని.. త్వరలోనే సినిమా ఆడియన్స్‌ను పలకరించనుందని తెలుస్తుంది. మరి.. ఇంతకీ వీరమల్లు ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు ఒకసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన‌ హరిహర వీరమల్లు దాదాపు ఐదేళ్లు సెట్స్‌పై కొనసాగింది. పవన్ నుంచి.. సుదీర్ఘ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడం.. పవన్ మొదటి సారి హిస్టోరికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో నటిస్తుండడంతో పవన్ ఎలా కనిపించబోతున్నాడని ఆసక్తి అభిమానులు మొదలైంది.

Pawan Kalyan's Hari Hara Veera Mallu fetches career-best deal for superstar  - Hindustan Times

ఈ క్రమంలోనే సినిమా పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ పరంగా రాణిస్తుంది. కాగా.. తాజాగా ఈ సినిమా రైట్స్‌ ప్రముఖ డిస్టిక్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ దాదాపు రూ.50 కోట్లకు పైగా భారీ మొత్తాన్ని చెల్లించి మరీ.. సినిమా రైట్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇక ఇటీవల కాలంలో స్టార్ హీరోలు సినిమాలో సైతం కేవలం నాలుగు వారాల్లో డిజిటల్ ప్లాట్ ఫార్మ్‌లో సందడి చేస్తున్నాయి. అయితే థియేటర్లో రిలీజ్ అయ్యిన 6 వారాల త‌ర్వాత మూవీ రిలీజ్ అయ్యేలా మేకర్స్ అమెజాన్ తో డీల్ కుదుర్చుకున్నారట. ఈ క్రమంలోనే సెప్టెంబర్ చివరి వారంలో ఓటీటీలో వీరమ‌ల్లు సందడి చేయనుంది.