డైనమిక్ హీరో మంచు విష్ణు తాజాగా నటించిన మైథిలాజికల్ మూవీ కన్నప్ప. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక సినిమాలో ప్రభాస్ , మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక ఏకంగా ఇంతమంది స్టార్ కాస్టింగ్ నటించిన కన్నప్ప సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
ఇలాంటి క్రమంలో తాజాగా మంచు విష్ణు రిలీజ్ చేసిన ఓ పోస్టర్‌ను ట్రోల్స్‌కు దారి తీసింది. కన్నప్ప విషయంలో మంచు విష్ణు పోస్ట్ చేసిన పోస్టర్ కూడా అతిగా అనిపించింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్ అంటూ ఓ పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు కన్నప్ప మేకర్స్. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నాపై ట్రోల్స్ చేస్తే కేస్ వేస్తా అంటూ మంచు విష్ణు ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించినా.. ఇలాంటి పోస్టర్స్ చూసినప్పుడు ట్రోల్స్ తప్పవంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రిలీజ్ అయిన సినిమా ఫస్ట్‌డేకి ఇండస్ట్రియల్ హిట్ ఎలా అయింది అంటూ.. తొందరపడి విష్ణు ముందే ఇండస్ట్రియల్ హిట్ పోస్టర్లు కొట్టేసాడు అంటూ.. అసలు ఇండస్ట్రీల హిట్ అంటే అర్థం తెలుసా అంటూ.. రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.
అసలు ఇండస్ట్రియల్ హిట్ అంటే టాప్ వన్ లో ఉన్న సినిమాను అధిగమించి కలెక్షన్లు కొల్లగొడితే అప్పుడు ఇండస్ట్రియల్ హిట్ అంటారు. మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్ అంటే బాహుబలి 2, తర్వాత పుష్ప 2, ఆర్ఆర్ఆర్, కల్కి. ఈ సినిమాలన్నింటి రికార్డులను బ్రేక్ చేస్తే అప్పుడు దాన్ని ఇండస్ట్రియల్ హిట్ అంటారు. అంతేకానీ.. ఫస్ట్ డే ఓపెనింగ్ రూ.20 కోట్లు కొల్లగొట్టగానే ఇండస్ట్రియల్ హిట్ అయిపోదు విష్ణు అంటూ కామెంట్లు చేస్తున్నారు.