టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్, వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ తమ్ముడు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ డ్రామాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాలో సీనియర్ నటి లయ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇక సప్తమి గౌడ, వర్షా బొల్లమ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జౌన్ 4న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్ లాంచ్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ స్టార్ హీరోల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. నిర్మాతలకు బడ్జెట్ సమస్యలు ఏర్పడినప్పుడు స్టార్ హీరోలు వాళ్లకు కోపరేట్ చేయాలని చెప్పుకొచ్చాడు. తమ్ముడు సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా షూట్ టైంలో ఆలస్యం అవుతూ వచ్చింది. దానికి తోడు బడ్జెట్ అంతకంతకు పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే ఓ రోజు వేణు శ్రీ రామ్‌ని పిలిచి.. బడ్జెట్ గురించి అడిగా నేను. శ్రీరామ్ నాతో సార్ ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువ అవుతుందని నేను ముందే మీకు చెప్పాను కదా.. అని అన్నాడు. నిజంగానే ఇంత బడ్జెట్ పెడుతున్నావ్. కానీ.. అది వెనక్కి రావడం కూడా ముఖ్యమే కదా.. అది ఎలా అని అడిగా.. దాంతో వేణు శ్రీరామ్ వెంటనే తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధమైపోయారు. నితిన్ సైతం బడ్జెట్ గురించి చెప్పినప్పుడు అంకుల్ మీరు ఎంత పంపిస్తారో అంతే రెమ్యూనరేషన్ ఇవ్వండి. నేను రెమ్యునరేషన్ గురించి అసలు మిమ్మల్ని అడగనని చెప్పేసాడు అంటూ దిల్ రాజు ప్రసంసలు కురిపించాడు. దిల్ రాజు రెమ్యునరేషన్ ప్రస్తావన తీసుకురావడంతో.. మీడియా ప్రతినిధులు వెంటనే ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు కురిపించడం మొదలుపెట్టారు.
రెమ్యునరేషన్ విషయంలో స్టార్ హీరోలను కూడా ఒప్పించగలరా.. ధైర్యం మీకుందా.. అని ప్రశ్నించగా. నాకు ఆ ధైర్యం ఉంది అంటూ దిల్ రాజు రియాక్ట్ అయ్యాడు. హీరోలకు అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు కచ్చితంగా కోపరేట్ చేస్తారు. అందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. బృందావనం ఎన్టీఆర్, మిస్టర్ పర్ఫెక్ట్.. ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు.. మహేష్, వకీల్ సాబ్‌కు.. పవన్ బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని నాకోసం రెమ్యునరేషన్‌ను తగ్గించుకున్నారు అంటూ వివరించాడు. స్టార్ హీరోలు దొరకరు అనే ఉద్దేశంతో నిర్మాతలు తొందరపడి రెమ్యునరేషన్ అధికంగా ఆఫర్ చేస్తారు. ఇది పోటీ ప్రపంచం.. అలాంటివి కచ్చితంగా ఉంటాయి. కానీ.. సందర్భం వచ్చినప్పుడు రెమ్యునరేషన్ విషయంలో హీరోలు తప్పకుండా సహకరిస్తారు. అలాంటి హీరోలు కూడా చాలామంది ఉన్నారు అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.