కన్నప్ప టీంకు బిగ్ షాక్.. ఆన్లైన్ లో హెచ్డి ప్రింట్..!

ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా యుగంలో సినిమా తెరకెక్కి సేఫ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యే వరకు.. సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలకు సైతం కంటిపై కునుకుండ‌టం లేదు. కారణం లీక్‌ల భయం. సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచి రిలీజ్ వరకు ఎలాంటి లీక్‌లు బయటకు రాకుండా మూవీ టీం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న.. ఏదో ఒక పోస్టర్, లేదా ఒక సీన్, లేదంటే మేకర్స్ దాచిపెట్టిన లుక్స్ ఇలా ఎప్పటికప్పుడు లీక్స్ వైరల్ గా మారుతూనే ఉంటున్నాయి.

ఇవి మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. అలాంటిది.. ఇప్పుడు మాత్రం ఏకంగా ఫుల్ సినిమానే హెచ్డీ ప్రింట్ తో ఆన్లైన్లో లీక్ అవడం సంచలనాన్ని సృష్టించింది. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందించిన ఈ సినిమా.. రిలీజై ఒక్కరోజు కూడా కాకముందే ఆన్లైన్లోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. అసలు మేటర్ ఏంటంటే విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మైథాలజికల్ మూవీ కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు పాజిటివ్ రివ్యూలే వచ్చాయి.

ఇక టాక్ పరంగా సక్సెస్ అందుకుంటున్న కన్నప్ప సినిమా.. థియేటర్లలో రిలీజై 24 గంటలు కూడా పూర్తకముందే.. ఆన్లైన్‌లో ప్రింట్ రావ‌డం సంచలనంగా మారింది. ఇది మూవీ టీంకు బిగ్ షాక్ అనే చెప్పాలి. కన్నప్ప రిలీజ్ కు ముందే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు మేకర్స్. ఈ సినిమా రివ్యూ వల్ల పై ముందస్తు జాగ్రత్తగా నోటీసులు కూడా రిలీజ్ చేశారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా సినిమా మొత్తాన్ని ఆన్లైన్లో లీక్ చేశారు ఆకతాయిలు. మరి వీరిపై విష్ణు ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నారు.. ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.