పవన్ వీరమల్లు కోసం కోట్లు ఖర్చు పెట్టిన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మరో 16 రోజుల పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుంది. తాజాగా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. సౌండ్ మిక్సింగ్ తో మొదటి కాపీని చూసిన మేకర్స్‌.. నేటితో బ్యాగ్రౌండ్ వర్క్, రీ రికార్డింగ్‌ కూడా పూర్తి చేయనున్నారు. అప్పుడే పూర్తి స్థాయిలో ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమా పూర్తవుతుంది. కాగా.. ఇప్పటికే ఈ సినిమా ఇప్పటివరకు ఉన్న ఇండస్ట్రియల్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించడం ఖాయమని.. కేవలం తెలుగు వర్షన్ మాత్రమే కాదు హిందీ వర్షన్ లోను అద‌రగొడుతుందని.. స్ట్రాంగ్ బిలీవ్‌తో ఉన్నారు.

ఈ సినిమా అంతా అద్భుతంగా తెరకెక్కించామని.. ఒకటి కాదు, రెండు కాదు, ఆరు యాక్షన్ సన్నివేశాలు కళ్ళు చెదిరే రేంజ్‌లో తీర్చిదిద్దినట్లు సమాచారం. పవన్ కెరీర్‌లో ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదని టాక్. ఇక అసలు విషయానికి వస్తే.. సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్ని ప్రాంతాల్లో పూర్తికాగా.. మలయాళం వెర్షన్ కి సంబంధించిన థియేటర్ హక్కులు మాత్రం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ భారీ రేటుకు దక్కించుకున్నాడు. సుమారు రూ.3 కోట్లకు ఆయన ఈ థియెట్రిక‌ల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. కేరళలో పవన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో.. ఆయన నటించిన ఎన్నో సినిమాలుకు అక్కడ ఫస్ట్ డే నుంచే భారీ ఓపెనింగ్స్ మొదలయ్యాయి.

అంతేకాదు.. కేరళలో దాదాపు 35 వేలకు పైగా తెలుగు ప్రజలు స్థిరపడ్డారు. అంతేకాదు.. ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకుంటున్న ఎంతోమంది విద్యార్థులు సైతం పవన్ కళ్యాణ్ సినిమాను చూసేందుకు ఆరాటపడుతున్నారు. కనుక హరిహర వీరమల్లుకి అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల పరంగా మరింత ప్లస్ అవుతుంది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ ఈ రైట్స్‌ను సొంతం చేసుకున్నాడట. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బయ్యర్ల లిస్టు మరో రెండు రోజుల్లో రివీల్‌ చేయనున్నారు. కాగా.. దాదాపు అన్ని ప్రాంతాల్లో సినిమా బిజినెస్ అడ్వాన్స్ బేసెస్‌మీదే పూర్తి చేసినట్లు సమాచారం. అంటే అడ్వాన్స్ రికవరీ అయ్యాకే వచ్చే లాభాలు మొత్తం నిర్మాత జేబుల్లోకి వెళ్ళ‌నుంది. మరి ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.