చిరుతో మూవీ అంటే అది కంపల్సరీ.. లేదంటే మెగా కాంపౌండ్ కు నో ఎంట్రీ..!

ఇండస్ట్రీలో దర్శకులుగా అడుగుపెట్టి పలు సినిమాలతో సక్సెస్ అందుకుని.. తమని తాము ప్రూవ్ చేసుకున్నప్పటికీ.. స్టార్ హీరోలతో సినిమాలు తీయాలంటే ఎంతగానో ఎదురు చూడాల్సి వ‌చ్చేది. కానీ.. ఇప్పుడు అలా కాదు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సరైన కంటెంట్ ఎంచుకొని.. ఒక బిగ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ రూపొందించి.. బ్లాక్ బస్టర్ కొడితే చాలు.. ఎంత పెద్ద సీనియర్, స్టార్ హీరోలైన ఎలాంటి పాన్ ఇండియన్ హీరోలైన.. ఆ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ఆరాట‌పడుతున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్‌తో ఎంతో మంది స్టార్ హీరోలు సినిమా చేయాలని కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే.. మొదట మెగాస్టార్ చిరంజీవి పేరు గుర్తుకువస్తుంది. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ హీట్‌లు అందుకున్న చిరంజీవి.. సేవా కార్యక్రమాలతో వ్యక్తిగతంగాను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు.

Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ | director- vasishta-interview-about-chiru-157-movie

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. తన పేరుతో మరింత మంది ఇండస్ట్రీలోకి వచ్చే రేంజ్‌కు ఎదిగాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమంది.. మేము ఇండస్ట్రీ లోకి రావడానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు వరుస బ్లాక్ బ‌స్టర్‌ల‌తో దూసుకుపోయిన చిరంజీవి.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఒక్క సరైన హిట్ కూడా అందుకొని సంగతి తెలిసిందే. ఏదో మెగాస్టార్ నటించిన మూవీ అని ఫ్యాన్స్ ఆయన సినిమాలను హిట్ చేస్తూ వచ్చారు తప్పించి.. ఆయన రేంజ్ కు తగ్గ ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు సెకండ్ ఇన్నింగ్స్ లో రిలీజ్ కాలేదు. మెగా ఫ్యాన్స్.. కాలర్ ఎగరేసే రేంజ్‌లో ఏ సినిమా లేదు. అయితే.. త్వరలోనే ఫ్యాన్స్ కోరిక నెరవేరానుందట.

#Mega157 Gang Revealed! 🔥| Chiranjeevi & Anil Ravipudi’s Hilarious Fun

మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందనున్న సినిమాతో వింటేజ్‌ చిరును చూడబోతున్నారని.. కచ్చితంగా ఆయన రేంజ్ బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా చిరంజీవి ఇటీవల కాలంలో కమిట్ అవుతున్న డైరెక్టర్ల లిస్ట్ చూస్తే జనాలకు ఓ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అదేంటంటే.. స్టేటస్‌ని చూసి చిరు సినిమాల్లో అవకాశాలు ఇవ్వరు. అయితే చిరంజీవి మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెట్టి.. ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవాలంటే మాత్రం ఈ రెండు పాయింట్లు కంపల్సరీ. అవేంటంటే దర్శకుడిలో సినిమాపై ఆసక్తి ఉండాలి. ఏదో తూతూ మంత్రంగా సినిమా చేసి వదిలేస్తే సరిపోదు. అలాగే డైరెక్టర్ కచ్చితంగా ముందు రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టి ఉండాలి. ఈ రెండు పాయింట్లు ప్రస్తుతం చిరంజీవి ఎంచుకున్న దర్శకులలో కామన్ గా ఉంటున్నాయి. అప్పుడే మెగా కాంపౌండ్ లో ఎంట్రీ ఉంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం అవుతున్నాయి.