మహేష్ ని అరెస్ట్ చేస్తే.. ఇండస్ట్రీ వారంతా ఎటుపోయారు.. తమ్మా రెడ్డి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకనిర్మాతగా పేరుపొందారు తమ్మారెడ్డి భరద్వాజ.. ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య ఉన్న రిలేషన్స్ పైన ఫైర్ అవ్వడం జరుగుతోంది .ఇండస్ట్రీలో ఐక్యత ఉండదని తెలియజేశారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరిని ఒకరు అండగా నిలబడాలని తెలియజేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. తమ్మారెడ్డి మాట్లాడుతూ.. అర్జున్ సినిమా పైరసీ సమయంలో మహేష్ కి అండగా ఎవరు నిలబడలేదని గుర్తు చేశారు. ఇండస్ట్రీలో చిన్నవాడైన, పెద్దవారైనా అందరిని గౌరవించుకొని కలుపుకొని పోవాలని తెలిపారు.

Thammareddy : Pawan promised Mahesh.. but it.. Thammareddy's sensational  comments!
ఇలా చేయడం వల్ల ఏమొస్తుందని అనుకునేవారికి బుద్ధిలేని వాడని తెలిపారు.. అలాంటి వారిని చూసి నవ్వి ఊరుకుంటానని తెలిపారు. పైరసీ పై మహేష్ బాబు ఫైట్ చేస్తున్న సమయంలో అతనికి ఎవరు సపోర్ట్ చేయలేదు.ఆయన వచ్చి ఛాంబర్ లో కూర్చున్నారు.. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం అయామ్ విత్ యు అని అన్నారని తెలిపారు.. మరి మహేష్ ను కలిసారా లేదా అన్న విషయం నాకైతే తెలియదు.. నేను వచ్చేసరికి ఫిలిం చాంబర్లో మహేష్ మాత్రమే ఉన్నారని తెలిపారు.

పైరసీ అనేది ఇండస్ట్రీ నాశనం కావడానికి కారణమనుకుంటున్నా రోజుల్లో ఒక హీరో ధైర్యంగా వెళ్లి పట్టుకుంటే పోలీసులు అతన్ని అరెస్టు చేసి హడావిడి చేస్తుంటే ఇండస్ట్రీ లో ఎవరూ మాట్లాడలేదు.. అసలు ఇక్కడ మొగోడు లేడా..మళ్లీ మొగోడు అంటే కాంట్రవర్సీ అయిపోతుంది వీళ్ళందరికీ మాట్లాడడానికి ఏం హక్కు ఉంది అంటూ తెలిపారు తమ్మారెడ్డి. ఇలాంటి వారికి ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు అంటూ తెలిపారు.. మహేష్ కి ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో ఆయన నేను ఎక్కడికి రానని అంటున్నారు.. అంతకుముందు కూడా ఎవరు పిలిచిన వచ్చేవారు.. అందర్నీ కలిసేవారు కానీ ఇప్పుడు ఎవరిని కలవడం లేదు తన పని తాను చేసుకుంటూ ఉన్నారని తెలిపారు.