పపవన్ సినిమాల వల్ల కెరీర్ పోగొట్టుకున్న హీరోయిన్లు వీళ్లే..!

టాలీవుడ్‌లో పవర్ స్టార్‌గా పవన్ కళ్యాణ్‌కి ఎంతటి అసాధారణమైన క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ అన్నయ్య మెగాస్టార్ అయినా, టాలీవుడ్ ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అయినా..బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్స్ ఉన్నా పవన్ క్రేజ్ ముందు అంతా కాస్త తక్కువనే మాట పవన్ యాంటీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకొని తీరాల్సిందే. కెరీర్ ప్రారంభంలో మొదటి సినిమా తప్ప మిగతావన్నీ వరుసగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ కూడా వచ్చాయి.

అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద పవన్ సినిమా రిలీజ్ కాబోతుందీ అంటే వారి అబీమానుల‌కి పండుగ‌ల ఉంటుంది. ప‌వ‌న్ సినిమాల‌కు టాక్‌తో సంబంధం లేకుండా క‌ల‌క్ష‌న‌ల వ‌ర్షం కురుస్తుంది. ప‌వ‌న్ అన్న‌ మెగాస్టార్ సినిమా రిలీజ్‌కు ఉండే హడావుడి కంటే కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాకే ఎక్కువ క్రేజ్ అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇంత క్రేజ్ పవన్ ఎలా ? సాధించాడూ అనేది కొన్ని కోట్ల మంది మెదడులో కదలాడే మిలియన్ డాలర్స్ ప్రశ్న.

article_image1

అయితే, పవన్ క్రేజ్ ఎంత ఉన్నా కూడా ఆయన సరసన నటించే కొందరు హీరోయిన్ల‌కి మాత్రం దానిలో పావు వంతు కూడా దక్కడం లేదు. పవన్ కళ్యాణ్ సరసన సుప్రియ, రాశి, దేవయాని, కీర్తిరెడ్డి, భూమిక, అమీషా పటేల్, రేణు దేశాయ్, మీరా జాస్మిన్, త్రిష, కృతి క‌ర్భంధా, శ్రియ శరన్, ప్రీతి జింగానియా, శృతి హాసన్, కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, కీర్తి సురేష్, అనూ ఇమ్మానియేల్..ఇలా మంచి గ్లామర్ బ్యూటీస్ అందరూ నటించారు. కానీ, వీరిలో చాలామందికి లైఫ్ లేకుండా పోయింది. ఐరెన్ లెగ్ అని అందరూ మాట్లాడుకున్న శృతి హాసన్‌కి గబ్బర్ సింగ్ సినిమాతో బంపర్ హిట్ ఇచ్చాడు పవన్. ఈ సినిమా తర్వాత నుంచి శృతిహాసన్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది.

ఇక భూమిక కూడా ఖుషి సినిమా తర్వాత ఓ వెలుగు వెలిగింది. రాశి అంటే అప్పటికే మంచి క్రేజ్ ఉన్న కారణంగా చాలాకాలం స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. ఇక పవన్ కళ్యాణ్‌తో నటించిన కొందరు హీరోయిన్లు అగ్ర హీరోయిన్ల ఎదిగినన మరికొందరు మాత్రం పవన్‌తో నటించిన మొదటిి సినిమాతోనే తమ కెరీర్‌ను పోగొట్టుకుని అడ్రస్ లేకుండా పోయారు. ఇక వారు ఎవరంటే కృతి కర్భందా, మీరా జాస్మిన్, ప్రీతి జింగానియా, కీర్తి రెడ్డి.. పంజా భామ‌లు అంజ‌లీ లావానియా, సారా జేన్ డ‌యాస్ ఇలా వీరు మాయ‌మైపోయారు.