టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ గత సంవత్సరమే ప్రారంభమైన మహేష్ ఇంట్లో జరిగిన వరస విషాదాలు కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.
త్రివిక్రమ్‌తో సినిమామా పూర్తయిన వెంటనే మహేష్- రాజమౌళి సినిమా షూటింగ్లో బిజీ అవుతాడు. ఇలా వరుస క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సూపర్ స్టార్. మహేష్ కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడనే చెప్పాలి. భరత్ అనే నేను – మహర్షి – సరిలేరు నీకెవ్వరు – సర్కారు వారి పాట సినిమాలు కమర్షియల్‌గా బాగా సక్సెస్ అయ్యాయి. ఇక మహేష్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీకి చాలా బాగా టైం కేటాయిస్తాడు.
భార్య నమ్రతతో పాటు కుమారుడు గౌతమ్, కూతురు సితారతో కలిసి విదేశాలకు వెకేషన్లకు చెక్కేస్తూ ఉంటాడు.హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఏ మాత్రం సమయం ఉన్నా కూడా ఫ్యామిలీకి బాగా టైం కేటాయిస్తాడు. ఒక్కోసారి అయితే ఫ్యామిలీతో సినిమాలకు వెళితే హైదరాబాద్‌లో ఇబ్బంది అవుతుందనుకున్నప్పుడు ఫ్యామిలీతో ముంబై లేదా బెంగళూరు వెళ్లి మరీ సినిమాలు చూసి వస్తాడు. ఇక మహేష్ సినిమాల విషయంలో నమ్రత కూడా ఇటీవల చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
మహేష్ కాస్ట్యూమ్స్, లుక్స్ విషయంలో నమ్రత ఇన్వాల్‌మెంట్ వచ్చాకే మహేష్ మరింత అందంగా కనిపిస్తున్నాడు. అయితే మహేష్ నటించిన అన్ని సినిమాల కంటే ఓ సినిమా అంటే నమ్రతకు చాలా ఇష్టం అట.. ఆ సినిమా ఏదో కాదు పోకిరి. 2006 ఏప్రిల్ లో వచ్చిన పోకిరి అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న చాలా రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
మహేష్, కృష్ణలలో ఎవరి నటన అంటే మీకు ఇష్టం అన్న ప్రశ్నకు నమ్రత ఆన్సర్ ఇస్తూ ఇద్దరిని కంపేరిజన్ చేయలేమని.. ఎవరి స్టైల్ వారిదని.. తనకు ఇద్దరూ ఇష్టమే అని చెప్పింది. ఇక హైదరాబాద్, ముంబై రెండు సిటీలు అంటే తనకు ఇష్టం అని… మహేష్ భార్య నమ్రతగా ఉండేందుకు తాను ఎంతో ఇష్టపడతానని చెప్పింది.