తమన్నా కోరిక బాలయ్య నెరవేరుస్తాడా.. మిల్కీ బ్యూటీ మరోసారి పప్పులో కాలేసిందిగా..!

కొన్నిసార్లు హీరోలు, హీరోయిన్లు తమకు వచ్చిన మంచి అవకాశాలను మిస్‌ చేసుకుంటారు. రెమ్యూనరేషన్ కారణంగానో లేదా ఇతర సినిమా షూటింగులతో బిజీగా ఉండటంవల్ల మంచి ఛాన్సులు మిస్ చేసుకుని ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇప్పుడు అలాగే బాధపడుతోందట. మూడున్నర పదుల వయసుకు వచ్చిన తమన్నా ఇప్పటికీ లైవ్ లోనే ఉంది. వ‌రుస సినిమాలు చేస్తు పోతుంది. విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు తమన్నాకు వరుస‌ పెట్టి అవకాశాలు ఇస్తున్నారు.

వెంకటేష్ పక్కన ఇప్పటికే ఎఫ్2 – ఎఫ్3 సినిమాల్లో తమన్నా జోడి కట్టింది. తమన్నా – వెంకీ జోడి ఆన్ స్క్రీన్ రొమన్స్ అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవితో తమన్న సైరా సినిమాలో జోడి కట్టేసింది. అయితే ఆ సినిమాలో త‌మ‌న్నాది సెకండ్ హీరోయిన్ రోల్‌. ఇక ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళాశంకర్ సినిమాలోని చిరుకు జోడిగా నటిస్తోంది. ఇక న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ పక్కన నటించే గోల్డెన్ ఛాన్సును తమన్నా రెండు సార్లు వదులుకుంది.

Tamanna Opens Her Desire For NBK! | cinejosh.com

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన‌ అఖండ సినిమాలో హీరోయిన్‌గా ముందు తమన్నానే సంప్రదించారు. అయితే అప్పుడు తమన్నా ఇతర సినిమా షూటింగులతో బిజీగా ఉంది. అఖండలో నటించేందుకు ఆమె ఒప్పుకోలేదు. అయితే అఖండ సూపర్ డూపర్ హిట్ అయింది. తమన్నా వదులుకున్న లక్కీ ఛాన్స్ ప్రగ్యా జైస్వాల్ కొట్టేసింది. నిజంగా తమన్నా అఖండ సినిమా చేసి ఉంటే ఆమె క్రేజ్ ఎక్కడో ఉండేది. కచ్చితంగా ఈ ముదురు వయసులో అది తమన్నాకు హెల్ప్ అయ్యి ఉండేది.

Balayya's Film Goes To Amazon, Here's Why!

ఇక ప్రస్తుతం బాలకృష్ణ తన 108వ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చూస్తున్నాడు. ఇక ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అయితే ఈ సినిమాకు కూడా ముందుగా తమన్నాను సంప్రదించినట్టు తెలుస్తుంది. దానికి తమన్నా నో చెప్పడంతో కాజల్ అగర్వాల్ ని కన్ఫర్మ్ చేశారట. ఈ సినిమా కూడా దసరా కనుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రాబోయే రోజుల్లో అయినా తమన్నా-బాలయ్య కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాలి.