మహానటి, లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌కు చేరువైన దుల్కర్ సల్మాన్ ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఇక దుల్కర్ నటించిన తాజా మూవీ కాంత. సెల్వరాజ్ డైరెక్షన్‌లో సముద్రఖని, రానా కీలక పాత్రలో మెరిసిన ఈ సినిమాలో.. భాగ్యశ్రీ హీరోయిన్గా నటించింది. ఇక దుల్కర్ ఓన్ బ్యానర్ – వేఫర్ ఫిల్మ్‌స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుబాటి – స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇక నవంబర్ 14 (నేడు) సినిమా గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించింది. మరి.. ఈ సినిమాతో దుల్కర్ మెప్పించాడా.. హిట్ కొట్టాడా.. లేదా.. రివ్యూలో చూద్దాం.
స్టోరీ:
1950 బ్యాక్ డ్రాప్‌తో కథ మొదలైంది. ఓ స్టార్ హీరో, డైరెక్టర్ చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. అయ్యా (సముద్రఖని) ఓ స్టార్ డైరెక్టర్. తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ శాంత. నట చక్రవర్తి టీకే మహదేవన్ అలియాస్ టికెఎమ్ (దుల్కర్ సల్మాన్) హీరోగా ప్రారంభమై.. ఓ కారణంతో మధ్యలోనే సినిమా ఆగిపోతుంది. మళ్లీ.. 8 ఏళ్ల తర్వాత ఇదే కథను టికే మహదేవన్‌తోనే.. అయ్యా చేయాల్సి వస్తుంది. అయితే.. అయ్యకు ఇది ఇష్టం లేదు. ప్రొడ్యూసర్ కారణంగా.. టికేఎమ్‌తో సినిమా చేసేందుకు ఒప్పుకుంటాడు. ఇక టీకెఎమ్ ఈ సారి కథ క్లైమాక్స్ మొత్తాన్ని మార్చేసి.. శాంత అనే టైటిల్ తీసేసి కాంతా అని పేరు మార్చేస్తాడు. అంతేకాదు.. అయ్యాను కేవలం కుర్చీకి పరిమితం చేసి.. తనకు నచ్చినట్లుగా సినిమా తీస్తుంటాడు.
ఇందులో కొత్త అమ్మాయి కుమారి (భాగ్యశ్రీ) హీరోయిన్గా నటిస్తుంది. ఆమెను నటిగా తీర్చిదిద్దింది కూడా డైరెక్టర్ అయ్యా నే. అటు హీరో.. ఇటు డైరెక్టర్ మధ్య ఈగో.. వాళతో సినిమా షూటింగ్ కొనసాగిస్తూ ఉంటుంది. ఇక చివరి రోజు ఒకే ఒక్క సీన్ మిగిలి ఉన్న క్రమంలో దర్శకుడికి ,హీరోకు మధ్యన పెద్ద వార్ జరిగి షూట్ ఆగిపోయింది. అదేరోజు స్టూడియోలో హత్య జరగడం.. అది ఎవరు, ఎందుకు చేశారు.. ఈ గురుశిష్యులైన టికేయం, అయ్యా మధ్య విభేదాలకు కారణమేంటి.. వీళ్లిద్దరివల్ల కుమారి ఎలా నష్టపోయింది.. ఇంతకీ స్టూడియోలో జరిగిన హత్య కేసును పోలీస్ అధికారి ఫినాక్స్ (రానా) ఎలా సాల్వ్ చేశాడు.. అనేది కథ. తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే.

రివ్యూ:
ఈ కాన్సెప్ట్ తెరపై చూపించడం అంత సులువు కాదు. సినిమాలోనే.. మళ్లీ మరో మూవీ ని చూపించాల్సి ఉంది. అది కూడా బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి కథ.. టెక్నికల్‌గా చాలా కష్టమైన సరే.. తెరపై చాలా చక్కగా చూపించే ప్రయత్నాలు చేశారు. అప్పటి సంగీతం, ఆటోవర్క్, కలర్ ట్యూన్ ఇలా అన్నిటిలోను తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకులను మెప్పించేలా.. అప్పటి బ్యాక్ డ్రాప్ కు కనెక్ట్ చేసేలా ప్రయత్నించి మూకర్స్ సక్సెస్ అయ్యారు. కానీ.. కథను ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా డిజైన్ చేయడంలో మాత్రం కాస్త తడబడ్డాడు డైరెక్టర్. తను ఎంచుకున్న పాయింట్స్ కేవలం సినీ వర్గాల్లో వ్యక్తులకు మాత్రమే నచ్చేలా డిజైన్ చేశాడు.
ఫస్ట్ హాఫ్ షో టైంలో.. డైరెక్టర్, హీరోకి మధ్యన జరిగిన వార్.. వాళ్ళ ఈగోల వల్ల కింద స్థాయి సిబ్బంది ఎలా ఇబ్బందులు పడ్డారో చూపించారు. హీరో, హీరోయిన్లు మధ్య ప్రేమ చుట్టూనే స్టోరీ ఆగింది. డైరెక్టర్, హీరోకి మద్య అసలు విభేదాలకు కారణాలేంటి అనేది.. పూర్తిగా చూపించకుండా కొన్నికొన్ని సీన్లు మాత్రమే చూపిస్తూ అసలు వీళ్ళ మధ్య జరిగిన గోల ఏంటో తెలియకుండా.. ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచాడు డైరెక్టర్. ఇక.. ఇంట్రవెల్ బ్యాక్, సెకండ్ హాఫ్ లో ఆడియన్స్‌లో ఆసక్తి మొదలైంది.

సెకండ్ హాఫ్ మొత్తం హత్య కేసు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సాధారణ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనే ఫీల్ ఆడియన్స్ కు వస్తుంది. ఇక.. కథలో పోలీస్ ఆఫీసర్ గా రానా ఎంట్రీ తో మరింత ఆసక్తి నెలకొంది. ఆయన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం చాలా చోట్ల లాగ్ అనిపిస్తుంది. ఈ కథ 1950 బ్యాక్ డ్రాప్‌తో సాగుతున్నా.. రానా ఎపిసోడ్ మాత్రం ఈ జనరేషన్ కాన్సెప్ట్లా అనిపించింది. ఇన్వెస్టిగేషన్లో బయటపడే ఒక్క చిన్న ట్విస్ట్ కథపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. హంతకుడు ఎవరనేది ముందే గెస్ చేసినా.. ఎందుకు హత్య చేశాడు అనేది మాత్రం గెస్ చేయడం అసాధ్యం. క్లైమాక్స్లో ఎమోషన్ సీన్స్‌కు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.
నటీనటుల పర్ఫామెన్స్:
దుల్కర్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు.. ఇది దుల్కర్ తప్ప మరెవరు చేయలేరు అనే ఫీల్ కలిగించాడు. ఇక సముద్ర ఖని తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు అని చెప్పవచ్చు. తెరపై డైరెక్టర్ అయ్యా తప్ప.. సముద్రపుకని ఆడియన్స్‌కు స్ట్రైక్ కాలేదు. హీరోయిన్గా భాగ్యశ్రీ అందాలకు పరిమితం అవడం కాస్త మైనస్. అయితే.. తన నటన మాత్రం ఆడియన్స్ను మెప్పిస్తుంది. నటి కుమారి పాత్రలో ఒదిగిపోయింది. ఇక రానా స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా.. ఉన్నంత సేపు ఆడియన్స్ అటెన్షన్ సొంతం చేసుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ రోల్ స్పేస్ లో మెప్పించారు.
టెక్నికల్‌గా:
నాణ్యత విలువలు చాలా బాగున్నాయి. జోక్స్ బిజోయ్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్.. సినిమాకు హైలైట్. కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు జాక్. జాను చాంతర్ పాటలు మెప్పించాయి. కథ అనుకూలంగా సాంగ్స్ చూపిస్తూ ఉన్నారే తప్ప.. ఎక్కడ బలవంతంగా పెట్టినట్లు అనిపించలేదు. దాని సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. అప్పటి టైమ్ రి క్రియేట్ చేయడంతో.. ఏదో పాతకాలం నాటి రోజుల్లోకి వెళ్లే ఫీల్ కలుగుతుంది. హార్ట్ వర్క్ మెప్పిస్తుంది. ఎడిటర్ కత్తెరకు మరికాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ షార్ట్ చేయాల్సింది. టోటల్‌గా.. టెక్నికల్గా సినిమా మెప్పించింది.
ఫైనల్‌గా: కాంత.. సినిమాలో సినిమా.. రక్తికటించే డ్రామా


