మెగా 157: చిరు సినిమాకు అనిల్ రావిపూడి మార్క్ టైటిల్.. ఏమై ఉంటుంది..!

అనీల్‌ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెగా 157 రన్నింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడీ సూప‌ర్ స్టార్‌ నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా మెరంనుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అనీల్ రూపొందిస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాతో అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో.. అలాంటి వింటేజ్ చిరును చూపిస్తానని.. చిరంజీవి అంటే కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు.. ఆయనలో కామెడీ యాంగిల్ కూడా అదే రేంజ్ లో ఉంది.. దాన్ని ఇప్పుడు హైలెట్ చేయబోతున్నానంటూ అనిల్ రావిపూడి గతంలోనే క్లియర్ గా వెల్లడించాడు.

ఏ క్రమంలోనే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి.. అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ర్‌పై సుస్మిత కొణిద‌ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో.. మెగాస్టార్ చిరంజీవి స్కూల్ పిల్లలకు ఆటలు నేర్పించే డ్రిల్ మాస్టర్గా మెర‌వ‌నున్నాడట‌. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ అనిల్ రావిపూడి చెప్పకనే చెప్పేసాడు. ఇటీవ‌ల ఓ ఈవెంట్లో మెగా డాటర్, కమ్‌ ప్రొడ్యూసర్స్ సుస్మిత కొణిదెలతో కలిసి.. అనిల్ రావిపూడి కూడా సందడి చేశాడు.

Mega 157 (2026) - IMDb

ఇక.. ఈ ఈవెంట్‌లో అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. శంకర వరప్రసాద్ అనే రోల్ లోనే చిరంజీవి కనప‌డనున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు.. అనే టైటిల్ తో మూవీ వ‌స్తుంద‌ని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో అనిల్ రావిపూడి రామెంట్స్‌తో టైటిల్ కూడా ఆల్మోస్ట్ ఇదే అని ఫిక్స్ అయిపోయారు నెటిజన్స్. ఇక వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయిపోతుందని వివరించాడు. అంతేకాదు.. సినిమాకు సంబంధించిన మరో కీలక ఆప్డేట్ అనీల్ రావిపూడి షేర్ చేసుకున్నారు. ఈనెల 22న మెగాస్టార్ బర్త్డే కనుక సినిమా టైటిల్, గ్లింప్స్‌ రిలీజ్ చేస్తామంటూ వివరించాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్ బర్త్డే సర్ప్రైజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.