వెంకీ – త్రివిక్రమ్ మూవీ మరో స్టార్ ఎంట్రీ.. ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్..!

సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ మామ నటిస్తున్న మూవీ ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతుంది. తాజాగా సినిమా టైటిల్ తో పాటు పోస్టర్‌ కూడా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోను ఇష్టపడని ఆడియన్స్‌ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో వీళ్ళిద్దరి కాంబ‌బోలో నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు కలిసి పనిచేస్తే చూడాలని ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చిరంజీవి లేటెస్ట్ ట్వీట్ వైరల్.. ఆ సినిమాని ఉద్దేశించే చెప్పాడా లేక వేరేనా

ఇక త్రివిక్రమ్ వెంకటేష్ గత సినిమాలకు కేవలం స్క్రీన్ ప్లే, మాటలు మాత్రమే అందించారు. మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వెంకటేష్ నటించబోతున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు ఆకాశానికంటాయి. ఇక తాజాగా సినిమాకు సంబంధించిన రూమర్స్ అభిమానుల్లో మరింత ఆసక్తిని నెల‌కొల్పుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ క్యామియో రోల్‌లో కనిపించనున్నాడట. క్లైమాక్స్‌లో కథ‌ని మలుపు తిప్పి గెస్ట్ రోల్‌లో ఆయన కనిపిస్తాడట. ఇదే నిజమైతే మాత్రం.. సినిమా రేంజ్ డబుల్ అయిపోతుంది అనడంలో సందేహం లేదు. రీసెంట్‌గా చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ కామియో పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ఫ్యామిలీ మ్యాన్ లుక్ లో వెంకీ.. ప్రారంభమైన 'ఆదర్శ కుటుంబం' -

ఇక.. ఆ సినిమాలో వాళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ చాలానే ఉన్నాయట. కచ్చితంగా వెంకటేష్ 20 నిమిషాల పాటు మెగా ఫాన్స్ మరియు వెంకీ ఫాన్స్ కు విజువల్ ఫీస్ట్‌ ఇచ్చేలా కనిపించనున్నాడని తెలుస్తుంది. అలాంటి మూవీ తర్వాత వెంకటేష్.. మెయిన్ రోల్‌లో నటిస్తున్న సినిమాలో చిరంజీవి స్పెషల్ రోల్ లో కనిపిస్తాడా.. లేదంటే కేవలం క్యామియో రోల్‌లో తళుక్కున మెరిసే మాయమవుతాడా తెలియాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం మాత్రం త్రివిక్రమ్.. చిరంజీవి రోల్ ను కూడా భారీ లెవెల్ లో ప్లాన్ చేశాడట. ఇక.. త్రివిక్రమ్ సాధారణంగా ఏ సినిమాలు రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. క్లైమాక్స్ సీన్స్ ప్రతి ఒక్కరి హార్ట్‌ను టచ్ చేసేలా డిజైన్ చేస్తాడు. అలాంటి క్లైమాక్స్‌లో మెగాస్టార్ కనిపిస్తున్నాడంటే ఏ రేంజ్‌లో డిజైన్ చేసి ఉంటాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంటుంది. మరి.. ఈ మ్యాజికల్ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.