భారీ ధరకు అమ్ముడైన పెద్ది ఓటిటి రైట్స్.. చరణ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ప్రస్తుతం పెద్ది సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్‌ హీరోయిన్‌గా మెర‌వ‌నుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్క‌నున్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ కీలక పాత్రలో మెర‌వ‌నున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో.. మెగా ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై భారీ ఆసలు నెలకొన్నాయి.

The Birth of 'Chikiri Chikri': AR Rahman and Buchi Babu Sana's Musical  Journey for Ram Charan's Romantic Number | - The Times of India

అదే రేంజ్‌లో చరణ్ కూడా సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రివీల్ అయ్యిన‌ టీజర్, చరణ్ లుక్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. చిక్కిరి సాంగ్‌ అయితే.. సోషల్ మీడియాలో ప్రకంపన సృష్టించింది. ఏకంగా 120 మిలియన్ వ్యూస్ టచ్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అంటూ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజాగా పెద్ది మరో క్రేజీ రికార్డును ఖాతాలో వేసుకుందట. అదేంటంటే.. పెద్ది సినిమా ఓటీటీ రైట్స్ రికార్డ్ ధరకు కొనుగోలు అయ్యాయ‌ట‌. ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులను ఏకంగా రూ.130 కోట్లకు సొంతం చేస్తుందని సమాచారం.

Peddi': After 'Chikri Chikri' makers to release second single from Ram  Charan starrer soon - Report | - The Times of India

ఇప్పటికే షూట్ కూడా కంప్లీట్ కానీ ఈ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం రికార్డు అనే చెప్పాలి. అది కూడా ఏకంగా రూ.130 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేయడం అంటే.. చరణ్ పెద్ది సినిమాపై ఆడియన్స్ లో ఏ రేంజ్ లో హైప్ ఉందో అర్థమైపోతుంది. జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే చాలు.. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతుంది అన్నడంలో సందేహం లేదు. అలాగే.. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పెద్ది సినిమాతో కచ్చితంగా రికార్డ్స్ క్రియేట్ అవుతాయ‌ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ఈ సినిమా 2026 మార్చ్ 27న చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.