టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగాకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ట్ డైరెక్టర్‌గా మారిన సందీప్ రెడ్డివంగా.. తర్వాత కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించాడు. గొప్ప విజయాలను ఖాతాలు వేసుకున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ అక్కడ మాఫియాను తిప్పికొట్టి స్ట్రాంగ్ దర్శకుడుగా ఎదిగాడు. ప్రస్తుతం పాన్ ఇండియా రెటల్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ పనుల్లో సందీప్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్రేజీ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది.
అదేంటంటే మహేష్ బాబుతో.. సందీప్ తన నెక్స్ట్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే మహేష్‌కు కథను కూడా వినిపించాడని.. అంతేకాదు వీళ్ళిద్దరి కాంబో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఏడాది సంక్రాంతి రోజున రివిల్ చేయనున్నారని టాక్. ఇక మహేష్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో వారణాసి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక సినిమా కేవలం పాన్ ఇండియా లెవెల్ కాదు.. గ్లోబల్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. మహేష్ సైతం తన నెక్స్ట్ సినిమా కూడా అదే రేంజ్‌లో ఉండాలని.. అంత గ్రాండియర్‌గా అనిపించాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్‌లో అంతటి ఇంప్యాక్ట్‌ను క్రియేట్ చేయగల దర్శకుడు సందీప్ రెడ్డి మాత్రమే అని మహేష్ భావిస్తున్నారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే సందీప్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే మాత్రం అది కచ్చితంగా బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్‌తో సినిమా చేసేందుకు సందీప్ ఒకటి కాదు.. రెండు, మూడు కథలను సిద్ధం చేశాడట. వాటిలో ఫైనల్ గా ఏ కథను సెట్స్ పైకి తీసుకు వస్తారో తెలియాల్సి ఉంది. కాగా.. సందీప్ రెడ్డివంగా బోల్ట్ కంటెంట్ కెరీఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే.. తన మార్క్‌ను పోగొట్టుకునే అవకాశం లేదు. ఆడియన్స్ సైతం ఆయన సినిమాలో బోల్డ్ కంటెంట్ లేకపోతే ఒప్పుకొనే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే.. ఫ్యామిలీ మ్యాన్‌గా ఇప్పటివరకు మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మహేష్‌ను బోల్డ్ సీన్స్ లో సందీప్ ఎలా చూపిస్తాడు,, అసలు మహేష్ అభిమానులు అలాంటి పాత్రను యాక్సెప్ట్ చేస్తారా లేదా,, తెలియాలి.



