పెద్ది: ఆ మ్యాటర్లో చరణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్.. బుచ్చిబాబు పై ఫైర్..!

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు స‌న్నా ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వికపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా మెరవనుంది. ఇక సినిమా అనౌన్స్మెంట్ అప్పటినుంచి ఆడియన్స్ లో మంచి అంచనాలను నెలకొల్పిన ఈ మూవీ.. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కరెంట్తో మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. దీంతో పాన్ వరల్డ్ లో సినిమాకు రీచ్ రావడం విశేషం. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ కచ్చితంగా చరణ్ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27 చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా రిలీజ్ చేసేందుకు మేకస్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Ram Charan's Leaked Photos from 'Peddi' Shoot Create Buzz Ahead of March  2026 Release | - The Times of India

ఈ క్రమంలోనే స‌రవేగంగా చోటును కంప్లీట్ చేస్తున్నారు. కాగా.. తాజాగా సినిమా నుంచి కొన్ని లీక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. పెద్ది టీంతో కలిసి చరణ్‌.. ఢిల్లీ వీధుల్లో సందడి చేశారు. అక్కడ.. పల్లు షెడ్యూల్స్‌ను కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో రామ్ చరణ్ లుక్, ప్రెజెన్స్‌కు సంబంధించిన వీడియో మీడియాలో లీకై తెగ వైరల్ గా మారింది. అయితే కొంతమంది అభిమానులు ఈ వీడియోను ఎంజాయ్ చేస్తుంటే.. మరి కొంతమంది ఫ్యాన్స్ మాత్రం దీనిపై భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి ఈ విధంగా లీక్స్ వస్తుంటే.. అది సినిమాకు పెద్ద దెబ్బ అయిపోతుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Leaked: Ram Charan shoots for Peddi in front of Parliament in Delhi

ముఖ్యంగా సినిమాలో కీ సీన్స్ అన్నీ లీక్ అయిపోతే సినిమాలో ఉండాల్సిన సర్ప్రైజ్ ఎలిమెంట్స్ పోతాయి.. ఇక సినిమాపై ఆసక్తి ఎలా ఉంటుంది.. అయినా ఇలాంటి లీక్స్ రాకుండా టీం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూట్ టైంలో సరైన భద్రత చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బుచ్చిబాబు సన్నాపైనే ఉందని.. ఇలాంటి లీకులు జరగకుండా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదంటూ ఫైర్ అవుతున్నారు. అది కూడా పెద్ది లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ విషయంలో ఎంత శ్రద్ధ వహించాలి.. అంటూ బుచ్చిబాబు పై ఫైర్ అవుతున్నారు. ఇకపైన మేకర్స్ ఈ లీక్ల విషయంలో సరైన శ్రద్ధ తీసుకొని.. జాగ్రత్త వహిస్తారు లేదు చూడాలి.