దివంగత నటుడు అలనాటి సోగ్గాడు టాలీవుడ్ నట దిగ్గజం శోభన్ బాబుకు ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి శోభన్ బాబు.. నటి వారసులుగా ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి ఎవరు ఎంట్రీ ఇవ్వలేదు. అయితే శోభన్ బాబు మనవడు.. డాక్టర్ సురక్షిత్ బత్తిన మాత్రం సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో తెగ వైరల్ గా మారుతున్నాడు. రకరకాల వార్తలతో ఆయన పేరు మారుమోగిపోతుంది. అందంలో తాతయ్య పోలికలతో.. హీరోలకు ఏమాత్రం తీసిపోని పర్సనాలిటీతో సురక్షిత్ అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన కెరీర్ మరియు.. సినిమాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఇంతకీ సురక్షిత ఎవరో కాదు.. శోభన్ బాబు కుమార్తె.. మృదుల కుమారుడు. ప్రస్తుతం చెన్నైలో పాపులర్ గైనకాలజిస్ట్ మరియు లేబర్స్కోపిక్ సర్జన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సురక్షిత తన కెరీర్, లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.

సాధారణంగానే సురక్షిత లుక్, ఫిజిక్ చూసి ఎంతోమంది సినిమాలోకి రావాలని హీరోలుగా పెద్ద ఆఫర్లు ఇచ్చారట. కానీ.. తనకు చిన్నప్పటినుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోవడం.. అలాగే తాను డాక్టర్ కావాలని వాళ్ళ తాతయ్య శోభన్ బాబు గారి కోరిక కావడంతో.. ఆయన ఆశయానికి అనుకూలంగా వైద్యవృత్తిని సెలెక్ట్ చేసుకున్నాను అంటూ వెల్లడించాడు. వైద్య రంగంలో సేవ చేయడమే నా లక్ష్యం అన్ని ఆయన క్లారిటీ ఇచ్చారు. తాతయ్య ఎప్పుడు మమ్మల్ని సినిమాల్లోకి వెళ్ళవద్దని స్ట్రిక్ట్‌గా చెప్పలేదని.. కానీ ఆయన పడ్డ కష్టాన్ని చూసి మేమే ఆ ప్రయత్నం చేయకూడదు అని ఫిక్స్ అయ్యాం అంటూ వివరించాడు. ఇక ప్రస్తుతం శోభన్ బాబు మనవడిగా కాదు.. తాను ఎంచుకున్న వృత్తిలో అగ్రగామిగా ఎదిగి పాపులారిటీ దక్కించుకున్నారు. ఇటీవల ఆయన ఒక మహిళ గర్భాశయం నుంచి 4.5 కిలోల భారీ కనితను 3d లాప్రోస్కోపీ సర్జన్ ద్వారా సక్సెస్ఫుల్గా తొలగించి రికార్డు క్రియేట్ చేశారు.

గతంలో ఒక డాక్టర్ 4.1 కణిత తొలగించి గిన్నిస్ రికార్డ్ సృష్టించగా.. సురక్షిత రికార్డును బ్రేక్ చేశాడు. చెన్నైలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. ఎంతోమందికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న సురక్షిత్ కు అందరు ఫిదా అవుతున్నారు. ఇక సురక్షిత తన తాత గురించి మాట్లాడుతూ.. మాకు కేవలం తాత ఆస్తులు కాదు.. క్రమశిక్ష, సమయపాలన కూడా వారసత్వంగా ఇచ్చారని చెప్పుకొచ్చాడు. చెన్నైలో ఆయన సంపాదించిన భూములు, ఆస్తుల నిర్వహణ విషయంలో ఆయన దూరదృషటి మేము ఎప్పటికీ మరువం అంటూ వివరించాడు. ఇక నటన రంగంలోకి అడుగుపెట్టకపోయిన.. నిరుపేదల ప్రాణాలకు అండగా వైద్యుడిగా సురక్షిత నిలబడుతూ అసలైన వారసుడు ఇలా ఉండాలి అంటూ శోభన్ బాబు పేరును నిలబెట్టాడు. ప్రస్తుతం సురక్షిత్ సేవలకు సోషల్ మీడియా వైద్య వృతి ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

