టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పెద్ది సినిమా నుంచి కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ చిక్కిరి.. సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకంపలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ లవర్స్ కు విపరీతంగా నచ్చేసిన ఈ సాంగ్.. లక్షలు షాట్స్, రీల్స్‌తో తెగ ట్రెండ్ అయ్యింది. ప్రతిచోట ఈ పాటే వినిపించింది. ఇక తాజాగా.. ఈ సాండ్ అన్ని భాషల్లోను 100 మిలియన్ మార్క్ కూడా క్రాస్ చేయడం విశేషం. ఈ క్రమంలోనే సినిమా నుంచి మేకర్స్ చిన్న సర్ప్రైజ్ను రివిల్ చేశారు.
మేకింగ్ వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో టీమంతా దాదాపు 45 నిమిషాల పాటు కష్టపడి ట్రెకింగ్ చేసి కొండపై ఎక్కుతున్న విజువల్స్ కనిపించాయి. చరణ్ కూడా కొండ ఎక్కుతూ టైడ్ అయిపోయి.. అక్కడక్కడ ఆగుతూ ఎక్కడం కనిపించింది. చివరిలో చిరుత గురించి డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్ మాట్లాడుకోవడం ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. చిక్కిరి మేకింగ్ వీడియోను చూసిన ఆడియన్స్ అందరిలోనూ ఈ లొకేషన్స్ ఇక్కడే ఉంటాయో తెలుసుకోవాలని ఆసక్తి మొదలైంది.

ఇక.. మహారాష్ట్ర లోని పూణేలో సవల్య ఘాట్ అనే ఏరియాలో ఎత్తైన కొండలు, చుట్టుపచ్చదనం.. కనువిందుగా ఉంటుందట. ఈ లోకేషన్ అదేనట. అక్కడ కొండపైనే.. ఈ చిక్కిరిచికిరి పాట షూట్ కంప్లీట్ చేశారు. దీనిపై ఎలాంటి వెహికల్స్ వెళ్లేందుకు అవకాశం లేదు. ఎవరైనా సరే ట్రాకింగ్ చేసుకుంటూ కొండ ఎక్కాల్సిందే. దీంతో టీం మొత్తం ట్రేకింగ్ చేసుకుంటూనే పైకి వెళ్లారట. దాదాపు 45 నిమిషాల పాటు చరణ్ ,జాన్వి, డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు టీమ్ అంత అలా ట్రెకింగ్ చేసుకుంటూ వెళ్ళిన ఈ వీడియోను ఫ్యాన్స్ ప్రస్తుతం తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. మీరు ఓ లుక్ వేసేయండి.

