టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ ఓజీ తో ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. లాంగ్ రన్ లో దాదాపు రూ.500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగ్గట్టుగానే టికెట్ రేట్లు తగ్గడంతో సినిమా కలెక్షన్స్ మరింత పుంజుకున్నాయి. కాగా.. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఓజీ రెమ్యూనరేషన్తో గొప్ప కార్యం చేశాడంటూ టాక్ నెటింట టాక్ తెగ వైరల్ గా మారుతుంది.
ప్రజెంట్ సినిమాలతో పాటు.. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం గా విధులను నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోజి సినిమా కోసం తాను తీసుకున్న పారితోషికాన్ని కౌలు రైతుల కోసం కేటాయించనున్నాడట. అసలు మేటర్ ఏంటంటే.. గత రెండు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసిన పలువురు రైతులు.. అప్పుల బాధలు భరించలేక తుది శ్వాస విడిచారు. ఆ విషయం తెలుసుకున్న పవన్ చలించిపోయి.. వారి కుటుంబాలకు అండగా నిలవాలని ఫిక్స్ అయ్యాడట. ఇందులో భాగంగానే తనకు తోచిన ఆర్థిక సాయం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
తన దగ్గర అంత మనీ లేకపోవడంతో.. ఓజీ ప్రొడ్యూసర్ దానయ్య దగ్గర నుంచి రెమ్యూనరేషన్ తీసుకొని వాళ్లకోసం ఇచ్చేసాడట. పవన్ రెమ్యునరేషన్ మొత్తాన్ని ప్రతిసారి ఎవరికో ఒకరికి సహాయం అందించడానికి వాడితూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు అంతా ఫీదా అవుతున్నారు. సినిమాల తో పాటే.. పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గాను అభిమానించే ప్రేక్షకుల సంఖ్య రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. పవన్ కళ్యాణ్ చేసే ప్రతిదానిలోనూ మంచి అర్థం ఉంటుందని చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అని.. మా పవర్ స్టార్ రియల్ హీరో అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.