టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ ఆడియన్స్‌లో విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అడప దడప ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వినిపించినా.. ఖచ్చితంగా ఆడియన్స్‌లో మాత్రం మంచి రెస్పాన్స్ ను దక్కించుకుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక.. ఈ సాంగ్ వింటుంటే భార్యాభర్తల మధ్యన మనస్పర్ధల బ్యాక్‌డ్రాప్‌తో స్టోరీ రూపొందుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక.. అనిల్ రావిపూడి తాను తెరకెక్కించే సినిమా ఏదైనా దాదాపు బ్యాక్ డ్రాప్‌ను హైడ్ చేస్తూ ఉంటాడు. కానీ.. ఈ సాంగ్ విషయంలో మాత్రం కావాలనే బ్యాక్ డ్రాప్ ను లీక్ చేశాడట.
దీని వెనక ఆయన స్పెషల్ స్ట్రాటజీని వాడుతున్నట్లు టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే.. సినిమా ఫుల్ బ్యాక్ డ్రాప్ ఇది కాదట. కేవలం సినిమాలో ఒక ఫేస్ మాత్రమే. చిరంజీవి మరో ఫేస్ థియేటర్లలో చూడాల్సిందేనని.. దానిపై సస్పెన్స్ మెయింటెన్ చేస్తూనే.. అనిల్ రావిపూడి సినిమా పై హైప్‌ను క్రియేట్ చేయడం కోసం.. ఈ సాంగ్ లో కొద్దిగా లీక్ ఇచ్చాడని తెలుస్తుంది. సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పటి వరకు సినిమాపై హైప్‌ను ఎంగేజ్ చేయడానికి.. అనీల్ ఈ స్ట్రాటజీని వాడాడట.
ఇక అనిల్ రావిపూడి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా బీమ్స్‌కు సైతం మంచి ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ఆయన కెరీర్‌లోనే ఇదో మైల్డ్ స్టోన్‌గా నిలిచిపోయిందని విశ్లేషకులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. చిరు సినిమాకు సైతం బీమ్స్ మ్యూజిక్ అందించాడు. ఇక.. మీసాల పిల్ల సాంగ్లోని సాహిత్యం, సంగీతం ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇలా.. మొత్తానికి చిరంజీవి సినిమాపై ఆడియన్స్ లో అంతకంతకు అంచనాలు పెంచేలా అనిల్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీలను వాడబోతున్నాడట. ముందు ముందు ఈ సినిమాను ఇంకే రేంజ్‌లో ప్రమోట్ చేస్తాడో.. ఆడియన్స్ లో ఏ రేంజ్ లో హైప్‌ను క్రియేట్ చేసుకుంటాడో చూడాలి.