వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే స్ట్రాంగ్ పోటీ మొదలైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు.. చిరంజీవి ,అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్‌గారు సినిమాను కూడా సంక్రాంతిలోనే రిలీజ్ చేయనున్నారు. దాదాపు 22 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరు వర్సెస్ ప్రభాస్ పోరు మొదలుకానుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆడియన్స్ సైతం ఈ వార్ విషయంలో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి క్రమంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈ వార్‌లో భాగం కానున్నాడని టాక్ నడుస్తుంది. అసలు మేటర్ ఏంటంటే.. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ.. డైరెక్టర్ కిషోర్ తిరుమల కలయికలో ప్రస్తుతం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేలా టీం ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా గత కొన్ని రోజుల క్రితం జరిగిన కార్మికుల సమ్మె వల్ల.. షూట్ అంతకంతపు వాయిదా పడుతూ వచ్చింది. ఇలాంటి క్రమంలో ఎంత కష్టమైనా సరే.. సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని జనవరి 13న ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ కష్టపడుతున్నారట. ఇప్పటికే సినిమా షూట్ శరవేగంగా జరుపుతున్న క్రమంలో.. అక్టోబర్ చివరికి సినిమాను కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుని సంక్రాంతికి రిలీజ్ చేయడం ఖాయం అంటూ తెలుస్తుంది.
ఇక సినిమాకు అనార్కలి టైటిల్ పరిశీలిస్తున్నారట. కాగా.. చిరంజీవి, ప్రభాస్ లాంటి ఇద్దరు బడా స్టార్స్ సంక్రాంతి బరిలో తమ సినిమాలతో పోటీపడుతున్న క్రమంలో.. రవితేజ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ కు బిగ్ షాక్ గా మారింది. రెండు బడా సినిమాలకు పోటీగా మన సినిమా రిలీజ్ చేయడం అవసరమా అన్న అంటూ.. రవితేజ బిగ్‌క్ రిస్క్ చేస్తున్నాడు అంటూ.. ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారంటూ రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇక రవితేజ నటించిన మరో మూవీ మాస్ జాతర. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లను ముగించుకుందని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో రిలీజ్ చేసినందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది.