ప్రొడ్యూసర్ బ్లాంక్ చెక్క్ ఇచ్చినా నీ సినిమాలో చేయనని తెగేసి చెప్పిన పవన్.. అసలు మేటర్ ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త‌నకంటూ ఒక యూనిక్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. అందరిదీ ఒక్కొక్క ప్రత్యేక స్టైల్. ఒక హీరో క్లాస్‌, ల‌వ్‌ సినిమాలు.. మరో హీరో రొమాంటిక్ సినిమాలు.. మరో హీరో హిస్టారికల్ సినిమాల్ అంటూ ఎవరి జానెర్లో వాళ్ళు నటిస్తూ ఉంటారు. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం డిఫరెంట్ జోన‌ర్‌ను టచ్ చేస్తూ.. దాదాపు అన్నింటినీ కవర్ చేశాడు. కెరీర్‌ ప్రారంభంలో తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి డిఫరెంట్‌ సినిమాల్లో నటించిన ఆయన.. తన స్వీయ డైరెక్షన్‌లో జానీ సినిమాతో మెప్పించాడు.

Is Pawan Kalyan quitting film industry? Actor reveals

పవన్ కెరీర్‌లో ఏ సినిమాకు లేని రేంజ్‌లో హైన్‌.. జానీ సినిమాకు వచ్చింది. దీంతో.. సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే.. ఈ సినిమా తర్వాత వరస ఫ్లాప్‌లు ఎదుర్కొన్న ప‌వ‌న్‌.. తర్వాత 10 సంవత్సరాల గ్యాప్ తో.. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి వరుస బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకొని.. తన సత్తా చాటాడు పవన్. ఇక.. అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్‌తో సినిమా చేసేందుకు ఓ స్టార్ ప్రొడ్యూసర్ బ్లాంక్ చెక్ కూడా ఇచ్చాడట. కానీ పవన్ కు మాత్రం ప్రొడ్యూసర్ వైఖరి నచ్చకపోవడంతో.. నీతో సినిమా చేయనని రిజెక్ట్ చేశాడు. నిజానికి పవన్ దృష్టిలో సినిమా అంటే 24 క్రాఫ్ట్‌ల‌కు చెందిన ఆర్టిస్టులు అందరిని దగ్గర చేసేది. దాన్ని బిజినెస్ యాంగిల్ లో చూడడం పవన్ కు అస్సలు న‌చ్చ‌దు.

ఈ క్రమంలోనే స్టార్ ప్రొడ్యూసర్ తో ముందు కొన్ని సినిమాలు చేసిన.. అతని పనితీరు నచ్చక.. తర్వాత సినిమా చేయడానికి నో చెప్పేసాడట‌. డబ్బుందనే గర్వం అప్రొడ్యూసర్లో ఎక్కువగా కనిపించింద‌ని.. అందుకే బ్లాంక్ చెక్క్ ఇచ్చిన సరే పవన్ తనను రిజెక్ట్ చేశాడంటూ తెలుస్తుంది. పవన్ మొదటినుంచి తనతో పాటు తన తోటి వాళ్ళను కూడా గౌరవిస్తూ ఉంటాడు. పొజీషన్‌ను బట్టి కాకుండా.. అందరు కళాకారులకు రెస్పెక్ట్ ఇస్తాడు. తను ఈ పోజిషన్ లో ఉన్న కూడా అలా ఆలోచించడం చాలా గొప్ప విషయం. ఇక సెలబ్రిటీస్ అంటే అది చిన్న పెద్దా అని తేడా లేదు ఎవరైనా ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయడానికి చూస్తారు

Special Edition on Pawan Kalyanవారిని గౌరవించడం తన బాధ్యతగా ఫీల్ అవుతాడు. అందుకే వాళ్ళ విషయంలో ఎవరినైనా ఎదిరిస్తాడు. అలా పవన్‌ను.. హీరోగా కంటే వ్యక్తిగతంగానే చాలామంది ఇష్టపడుతుంటారు. ప్రతి విషయంలో పవన్ చాలా క్లారిటీగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటాడు. అలా.. గతంలోనే ఎంతోమందికి ఉపాధిని కలిగించిన‌ పవన్.. అతని దృష్టిలో సినిమా అంటే చాలా గొప్పది.. ఈ విషయాన్ని స్వయంగా తానే చాలా సందర్భాల్లో వెల్లడించాడు. అలా ప్రొడ్యూసర్.. ఇతర సెలబ్రిటీల విషయంలో వ్యవహరించిన తీరు నచ్చక బ్లాంక్ చెక్ ఇచ్చినా సరే.. తన సినిమాలో నటించనని రిజెక్ట్ చేశాడట.