పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజీ. మొదటి రోజు వరల్డ్ వైడ్గా రూ.167 కోట్ల గ్రాస్ వసూళ్లను కల్లగొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్తో ఈ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి. అయితే.. కొంతమేరకు సినిమా పై నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. సినిమా మిడ్ వీక్ లో రిలీజ్ అయిన క్రమంలో కచ్చితంగా సెకండ్ డే కలెక్షన్స్ లో భారీ డ్రాప్ ఉంటుందని అంతా భావించారు. అయితే.. అందరూ అనుకున్నట్లుగానే సెకండ్ డే నూన్ షో వీక్ గానే స్టార్ట్ అయినా.. మ్యాట్నీ షో నుంచి జనం క్యూ కట్టారు.
కలెక్షన్స్ భారీ లెవెల్ లో పుంజుకున్నాయి. ఫస్ట్ షో, సెకండ్ షో అయితే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ సెంటర్స్ లోనూ సినిమా సంచలనాత్మక వసూళ్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే రెండో రోజు కూడా కలెక్షన్ల పరంగా ఓజీ జోరు ఎక్కడ తగ్గలేదని క్లారిటీ వచ్చింది. కానీ.. బీ,సీ సెంటర్లో మాత్రం సినిమా ఆశించని లెవెల్లో వసూళ్లు దక్కించుకోలేకపోతోంది. ఈ సెంటర్స్ లో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ రిత్యా సినిమా రెండవ రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.14 నుంచి రూ.15 కోట్ల షేర్ కొల్లగొట్టినట్లు సమాచారం. నార్త్ అమెరికాలో 5లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లో వచ్చాయట. ఓవరాల్గా.. ఓవర్సీస్తో కలిపితే.. ఏడు నుంచి ఎనిమిది లక్షల గ్రాస్ ఉంటుందని.. ఇండియన్ కరెన్సీ ప్రకారం మొత్తం రూ.8 కోట్ల గ్రాస్ నుంచి రూ.4 కోట్ల షేర్ వసూళ్లు రెండవ రోజు దక్కినట్లు తెలుస్తోంది.
అంతేకాదు.. ఇతర ఏరియాలో అన్నింటిలోనూ కలిపి మరో కోటి రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్గా రెండవ రోజున.. రూ.21 నుంచి రరూ.22 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కెరీర్లోనే కాదు.. ఈ ఏడాదిలోనే సెకండ్ హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా ఓజీ నిలవనుందని చెప్తున్నారు. ఇక రేపు వీకెండ్ కావడం.. సండే కలిసి రావడంతో.. వసూళ్లు మరింత పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు.. రేపటి నుంచి స్కూల్స్, కాలేజెస్ సెలవులు కావడంతో.. వారం రోజులపాటు సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో బ్రేక్ ఈవెన్ మార్క్ ఇట్టే దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇది ఎంతవరకు జరుగుతుందో.. చూడాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటితే మాత్రం 11 ఏళ్ల తర్వాత పవన్ కెరీర్ లో క్లీన్ హిట్ పడినట్లు అవుతుంది.