ఓజీ: బుక్ మై షో లో టాప్ బుకింగ్స్.. ఇది పవన్ రేంజ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు.. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ రచ్చ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈసారి ఓజీ విషయంలోనూ అదే రేంజ్‌లో ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. రిలీజ్ రోజు కంటే ముందే టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. బుక్ మై షో ఫ్లాట్‌ఫామ్‌పై పెద్ద సంఖ్యలో సేల్స్ జరగడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా.. ట్రేడ్ అంచనాల ప్రకారం ఓజీ రిలీజ్ డే రోజు బుక్ మై షో లో.. ఏ రేంజ్‌లో సేల్స్ జరిగాయి ఒకసారి చూద్దాం. ఓజీ ఫస్ట్ డే బుక్ మై షో లో 4.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయని.. ఈ సంఖ్యతో పవన్ ఓజీ సినిమా టాప్ టెన్ లిస్టులో బలమైన స్థానాన్ని దక్కించుకుందని.. ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

అయితే మరోవైపు చాలా టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్ లో కూడా సేల్ అవ్వడం విశేషం. ఇక అధికారికంగా బియ్యంఎస్ లో పూర్తిగా హైలెట్ కాలేదు కానీ.. పవర్ స్టార్ పవన్ రేంజ్ ఏంటో మరోసారి ఓజీ నిరూపించింది. ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో పుష్ప 2 ఉంది. బుక్ మై షో లో 17.5 లక్షల టికెట్లు రిలీజ్ డే రోజున ఈ సినిమాకు సేల్‌ అయ్యాయి. తర్వాత ప్లేస్‌లో కల్కి 2898 ఏడి.. 11 లక్షల టికెట్లను సేల్ చేసుకుంది. దేవర కూడా ఆరు లక్షల టికెట్లు అమ్మి టాప్ 3లో నిలిచింది. పవన్ ఓజీ 3 లక్షల టికెట్స్‌ సేల్స్‌తో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. గేమ్ ఛేంజ‌ర్‌ ఐదో స్థానంలో చోటు సొంతం చేసుకుంది. ఇలా.. బుక్ మై షో మొదటి రోజు టాప్ సేల్స్ ప్రకారం ఓజీ.. నాలుగో స్థానని దక్కించుకున్నా.. డిస్ట్రిక్ యాప్ ద్వారా కూడా మరిన్ని టిక్కెట్స్ బుక్ అయ్యాయి.

అలా.. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ స్థాయిలో మరింత ఎక్కువ సేల్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. మొత్తం ఫిగర్ ఇంకా హై రేంజ్ లో ఉంటుంది. ఆ ఫిగర్ ఏంటో తెలిస్తే.. ఓజీ ఈ లిస్టులో ఎన్నో స్థానాని దక్కించుకుంటుందో క్లారిటీ వస్తుంది. ఇక ఇప్పటికే బయటకు వచ్చిన ఫిగర్ తో చూసిన పవర్ స్టామినా ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం మీద బుక్ మై షో లో, ఆఫ్ లైన్ సేల్స్ లోను పవన్ సినిమా తుఫాన్ సృష్టిస్తుందన‌టంలో సందేహం లేదు. వీకండ్‌, దసరా సెలవులు కూడా కలిసి రావడంతో సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక ముందు.. ముందు.. ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.