OG కలెక్షన్ల ప్రభంజనం.. 4వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన లేటెస్ట్ మూవీ ఓజి. సుజాత డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తే దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా మొదటి మూడు రోజుల్లో ఏకంగా రూ.200 కోట్ల గ్రస్స్ ను కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్లు కల్లగొట్టిన రికార్డును క్రియేట్‌ చేసుకుంది. ప్రస్తుతం ఉన్న ఓజీ స్పీడ్ కు.. రూ.300 కోట్ల క్లబ్లో చేరడం పెద్ద క‌ష్టం ఏం కాదు. ఈ క్రమంలోనే ఓజీబడ్జెట్ డీటెయిల్స్.. బ్రేక్ ఈవెన్‌ టార్గెట్.. నాలుగు రోజుల్లో పవన్ కళ్యాణ్ ఓజీ ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో అనే డీటెయిల్స్ వైరల్ గా మారుతున్నాయి.

ఇక పవన్ వీరాభిమానిగా.. సుజిత్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో.. అర్జున్‌దాస్, ప్రకాష్ రాజ్‌, శుభలేఖ సుధాకర్, శ్రియ రెడ్డి, హరీష్ ఉత్తమన్‌, అభిమన్యుసింగ్, అజయ్ ఘోష్‌లు కీలక పాత్రలో మెరిసిన ఈ సినిమాకు.. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా.. ఎస్. ఎస్. థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇక ఈ సినిమా మొత్తానికి నటినటులు, సాంకేతిక నిపుణల‌, రెమ్యూనరేషన్, ఇతర కార్యక్రమాలు అన్నిటిని కలిపి రూ.250 కోట్ల బడ్జెట్ అయింది. ఇకపై.. రిలీజ్ లెక్కలు చూస్తే ఆంధ్ర రైట్స్ రూ.80 కోట్లకు, సీడెడ్ లో రూ.22 కోట్లకు, నైజాం థియేట్రిక‌ల్ రూ.55 కోట్లకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.

దీంతో.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ బిజినెస్ రూ.157 కోట్లు నమోదు అయింది. ఇక కర్ణాటక హక్కులైతే రూ.8 కోట్లు.. తమిళ్, కేరళ హక్కులు రూ.3 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక నార్త్ అమెరికన్ రైట్స్ అయితే రూ.25.5 కోట్ల మేర కొనుగోలు చేసినట్లు సమాచారం. పవన్ సినిమా యూఎస్ లో బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 4.5 మిలియన్ డాలర్ల వసూళ్లు కొల్లగొట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఓజీ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.193.5 కోట్ల రిలీజ్ బిజినెస్‌తో రిలీజ్ కాగా.. పవన్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.200 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. రూ.400 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక.. సినిమా ఈ మూడు రోజుల్లో పేయిడ్‌ ప్రీమియర్స్‌తో క‌లిపి రూ.21 కోట్లు, తొలిరోజు రూ.64 కోట్లు, రెండవ రోజు రూ.20 కోట్లు, మూడవ‌ రోజున రూ.19 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది.

OG Blasting the Box Office: $4.7M+ North America Gross

మూడు రోజుల్లో పాన్ ఇండియన్ వైడ్‌గా రూ.130 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని ఓవర్సీస్‌లో మరింత జోరు చూపించాడు. ఒక నార్త్ అమెరికాలోనే.. 4.7 మిలియన్ డాలర్ల వస్తువులు సొంతం అవడం విశేషం. ఈ విషయాన్ని ప్రత్యంగిరా మూవీ అఫీషియల్ గా వెల్లడించింది. అలాగే యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూరప్, గల్ఫ్, మెడలిస్ట్ తదితర దేశాల్లో మరో రూ.35 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో.. ఇప్పటివరకు ఓవర్సీస్‌లో పవన్ సినిమాకు రూ.75 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఇండియాలో వచ్చిన గ్రాస్.. ఓవర్సీస్ కలెక్షన్స్.. అన్నింటినీ కలుపుకొని ఓజీ రూ.3 రోజుల్లో రూ.205 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో.. మూడు రోజులకు రూ.127 కోట్ల గ్రాస్.. రూ.89 కోట్ల షేర్ దక్కించుకున్న ఓజీకి.. పవన్ పవర్ ప్యాకెట్ పర్ఫామెన్స్ తో పాటు.. ఆదివారం వీకెండ్ కూడా కలిసి రావడం దసరా హాలిడేస్ కూడా రావడం.. మరింత ప్లస్ అయింది. దీంతో ఓజీ నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.250 కోట్ల కలెక్షన్లు కొల్ల‌గొట్టిన‌ట్లో అంచ‌న‌.